Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: 'సినిమా చూపిస్త మావ'!

Tue 11th Aug 2015 06:07 AM
cinema chupistha mava,raj tarun,avika gour,dil raju  రెడీ ఫర్ రిలీజ్: 'సినిమా చూపిస్త మావ'!
రెడీ ఫర్ రిలీజ్: 'సినిమా చూపిస్త మావ'!
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం సినిమా విశేషాలు తెలిపేందుకు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో.. 

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''సినిమా చూపిస్త మావ అనే టైటిల్ విన్నప్పటి నుండి ఖచ్చితంగా సినిమా బావుంటుందనే ఆలోచన ఉండేది. దర్శకనిర్మాతలకు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను హోల్డ్ లో పెట్టండి నేను సినిమా మొదటి కాపీ చూసిన తరువాత డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటానని చెప్పాను. నా మాట మీద నమ్మకంతో సినిమా బిజినెస్ అంతా కంప్లీట్ అయిన నైజాం మాత్రం హోల్డ్ లో పెట్టారు. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఓ మాస్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చదువులో సరస్వతి లాంటి ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే అంశాలతో చిత్రీకరించారు. సినిమా మొదటి భాగం చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. రెండవ భాగం, క్లైమాక్స్ హైలైట్స్ గా నిలుస్తాయి. డైలాగ్స్ చాలా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా చేసారు. రాజ్ తరుణ్, అవికా గౌర్ లు చక్కగా నటించారు" అని చెప్పారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "ఇప్పటికే అన్ని ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్ జరుపుకొని, అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు సొంతం చేసుకొని ఈ సినిమాపై క్రేజ్ ను మరింత పెంచారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

దర్శకుడు త్రినాధరావు మాట్లాడుతూ "బెల్లంకొండ సురేష్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్, హీరో ఆది ఈ చిత్రాన్ని చూసి చాలా బావుందని చెప్పారు. టేబుల్ ప్రాఫిట్ లో ఈ చిత్రం ఉంది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో మాసివ్ లుక్ తో కనిపిస్తాడు. అవికా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది" అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ "దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. మాస్ ఆడియన్స్ కు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాను చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

అవికా గౌర్ మాట్లాడుతూ "చాలా ప్యాషన్ తో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందరు చాలా కష్టపడి పని చేసారు. మా కష్టానికి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, శేఖర్ చంద్ర, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోస్టర్స్‌ డిజైన్‌: విక్రమ్‌స్వామి, ఛీఫ్‌ ఆసోసియేట్‌ డైరెక్టర్‌: విశ్వనాధ్‌ అరిగెల, స్క్రిప్ట్‌ కోఆర్డినేటర్‌: సాయికృష్ణ, సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-రూపేష్‌ డి.గోహిల్‌-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ