నిర్మాత అల్లు అరవింద్ గారు సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై , మిర్చి, రన్‌రాజారన్, జిల్ లాంటి హ్యట్రిక్ సూపర్‌డూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న క్రేజి ప్రోడక్షన్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రొడక్షన్ నెం-1 గా రూపోందిస్తున్న ఫ్యామిలి అండ్ లవ్ ఎంటర్‌టైనర్ "భలే భలే మగాడివోయ్". నాని, లావణ్య త్రిపాఠి లు జంటగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లోని రేడియో మిర్చిలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా..
దర్శకుడు మారుతి మాట్లాడుతూ "ఇదొక కమర్షియల్ సాంగ్. గోపి సుందర్ గారు 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రం తరువాత ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. పాటలన్నీ అధ్బుతంగా వచ్చాయి. ఈ సినిమాలో కమర్షియల్ పాటలతో పాటు మంచి మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఆగస్ట్ 15న ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
హీరో నాని మాట్లాడుతూ "ఆడియో రిలీజ్ కు ముందుగానే చిత్ర టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయాలనుకున్నాం. ఈ సాంగ్ టీమ్ అందరికీ చాలా నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 'అలా మొదలైంది', 'అష్టాచమ్మా', 'పిల్ల జమీందార్' చిత్రాల తరువాత నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో నటించిన చిత్రమిది" అని చెప్పారు.
నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ మరియు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, ఎడిటర్:ఉద్దవ్, ఆర్ట్:రమణ వంక, ఫోటోగ్రఫీ:నిజార్ షఫి, సంగీతం: గోపి సుందర్, నిర్మాత:బన్నివాసు, రచన, దర్శకత్వం:మారుతి.