Advertisementt

రెడీ ఫర్ రిలీజ్: 'మాలిని అండ్ కో'

Sun 09th Aug 2015 02:35 PM
malini and co movie,ready for release malini and co,malini and co movie release details,poonam pandey  రెడీ ఫర్ రిలీజ్:  'మాలిని అండ్ కో'
రెడీ ఫర్ రిలీజ్: 'మాలిని అండ్ కో'
Advertisement
Ads by CJ

ఈ నెల 14న వస్తున్న పూనమ్ పాండే 'మాలిని అండ్ కో '

పూనమ్‌ పాండే, మిలన్  ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో 

మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’. ఈ చిత్రం  సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 14న రిలీజ్ 

అవుతుంది.ఈ సందర్భంగా: నిర్మాతలు  కిషోర్‌రాఠి, మహేష్‌రాఠిలు మాట్లాడుతూ:  సంచలన తార  పూనమ్‌ పాండే నటించిన ‘మాలిని అండ్‌ కో’సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్‌ మరియు రొమాంటిక్‌ జోనర్‌లో సాగుతుంది.   టాప్‌ టెక్నిషియన్స్‌ సపోర్ట్‌తో ఆరు పాటలు, బ్యాంకాక్‌, మలేషియాల్లో చిత్రీకరణ జరిపాము.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నాము అని అన్నారు. చిత్ర దర్శకుడు వీరు.కె. మాట్లాడుతూ: సినిమా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టేక్నీషియన్స్ అందరూ బాగా సహకరించారు. కధకనుగుణంగా పాటలుంటాయి. ఇటివల విడుదలైన పాటలకు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల 

ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు.

 పూనమ్‌పాండే, మిలన్, సామ్రాట్‌, సుమన్‌, జాకీర్‌, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష  తారాగణంగా నటించారు. 

ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, డ్యాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, తార, వినయ్‌, ఫైట్స్‌: విజయ్‌, సహ నిర్మాత: రవి హార్‌ కూట్‌, నిర్మాత: మహేష్‌ రాఠి, సంగీతం, 

దర్శకత్వం: వీరు.కె.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ