Advertisement

'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!

Wed 05th Aug 2015 10:35 PM
cinema chupistha mava,bekkam venugopal,raj tarun,prasanna kumar  'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!
'సినిమా చూపిస్త మావ' ప్రెస్ మీట్!
Advertisement

రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం సినిమా విశేషాలు తెలిపేందుకు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో.. 

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "ఇప్పటికే అన్ని ఏరియాలు ఫ్యాన్సీ ఆఫర్లతో బిజినెస్ జరుపుకొని, అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు సొంతం చేసుకొని ఈ సినిమాపై క్రేజ్ ను మరింత పెంచారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికాలో 14 సెంటర్లలో విడుదల చేస్తున్నాం" అని చెప్పారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "ఆగస్ట్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. దిల్ రాజు గారు ఈ సినిమాను చూసి చాలా ఎగ్జైట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అంగీకరించారు. అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు వస్తుంది" అని చెప్పారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ "దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. సినిమా ఘన విజయం సాధించడం ఖాయం. సంవత్సరంన్నర పాటు కష్టపడి చేసిన చిత్రమిది. సినిమాలో నా క్యారెక్టర్ పేరు కత్తి. మాస్ ఆడియన్స్ కు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు" అని చెప్పారు.

ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, మ్యూజిక్: శేఖర్ చంద్ర, ప్రొడ్యూసర్స్: బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement