ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అల్లరి నరేష్, సాక్షిచౌదరి జంటగా మచ్చ సాయి కిషోర్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందించిన చిత్రం ‘జేమ్స్‌బాండ్’. ఈ నెల 24న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్లతో ముచ్చటించారు. ఈ సమావేశంలో..
దర్శకుడు సాయి కిషోర్ మాట్లాడుతూ..
''2005 లో సినిమాలపై ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పటినుండి కో డైరెక్టర్ గా వై.వి.ఎస్.చౌదరి, శ్రీనువైట్ల గారి దగ్గర పని చేసాను. అనిల్ సుంకర గారు నరేష్ డేట్స్ ఉన్నాయి. తనకు సూట్ అయ్యే కథ ఏమైనా ఉందా అని అడగగానే స్టొరీ లైన్ చెప్పాను. నరేష్ కు చెప్పగానే నచ్చింది. స్టొరీ డెవలప్ చేసి కథను సిద్ధం చేసాను. ఈ చిత్రంలో కామెడీ మాత్రమే కాదు ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసిన వారిలో సాయి అన్ని రకాల సినిమాలు చేయగలడు అనే అభిప్రాయం కలుగుతుంది. టైటిల్ హీరోయిన్ పేరు మీదున్న సినిమా కథ అంతా హీరో మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాలో సిట్యుయేషనల్ సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమా కోసం నరేష్, ప్రొడ్యూసర్ గారు నాకు ఎంతగానో సహకరించారు. ఎక్కడ కాంప్రమైస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రీసెంట్ గా జేమ్స్ బాండ్ సక్సెస్ టూర్ కు వెళ్లాం. వైజాగ్, కాకినాడ, గుంటూరు, కడప, శ్రీకాకుళం అన్ని ఏరియాల నుండి మంచి స్పందన వస్తోంది. విజయవాడలో కలెక్షన్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. మూడవవారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రం ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లోనే చేయబోతున్నాను. కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమా అది. కథను సిద్ధం చేసుకున్నాను. అన్ని కుదిరితే అక్టోబర్ లో సినిమా షూటింగ్ మొదలుపెడతాం" అని చెప్పారు.