తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విజయ్ హీరోగా శింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పులి' చిత్రం తెలుగు రైట్స్ అక్షరాలా 9 కోట్లు. తెలుగులో విజయ్‌కి అంతగా మార్కెట్ లేనప్పటికీ ఈమధ్య విడుదలైన 'జల్లా' రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టడంతో 'పులి' చిత్రంపై బయ్యర్స్ హోప్స్ పెట్టుకున్నారు. 'జిల్లా' చిత్రానికి మంచి రిజల్ట్ రావడంతో 'పులి' తెలుగు రైట్స్ కోసం తెలుగు నిర్మాతలు క్యూ కట్టారు. దాంతో 'పులి' నిర్మాతలు ఒక్కసారిగా రేటు పెంచేశారు. 12 కోట్లకు రూపాయి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రేటు విన్న నిర్మాతలు ఒక్కొక్కరు డ్రాప్ అయిపోగా ఎస్.వి.ఆర్. మీడియా అధినేత్రి శోభారాణి మాత్రం వారిని కన్విన్స్ చేసి 9 కోట్లకు ఫైనల్ చేసుకుందట. ఫైనల్ చేసుకోవడమే కాకుండా కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. ఎస్.వి.ఆర్. మీడియా గతంలో చాలా తమిళ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. తను తీసుకున్న సినిమాని ప్రమోట్ చేసే విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది శోభారాణి. దాన్ని దృష్టిలో వుంచుకునే 'పులి' నిర్మాతలు తాము చెప్పిన రేటుకి మూడు కోట్లు తగ్గించి శోభారాణికే ఫైనల్ చేశారు.