Advertisement
Banner Ads

'కౌసల్య' మూవీ ఆడియో లాంచ్!

Mon 03rd Aug 2015 03:57 AM
kousalya movie,mahesh aapala,ramesh babu,madhusudan samala  'కౌసల్య' మూవీ ఆడియో లాంచ్!
'కౌసల్య' మూవీ ఆడియో లాంచ్!
Advertisement
Banner Ads

జనని క్రియేషన్స్‌ పతాకంపై శరత్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ రంజన్‌, అజయ్‌ దీవా, విక్రమ్‌, శ్వేతా ఖడే ముఖ్య తారాగణంగా మధుసూదన్‌ సామల, రమేష్‌ బాబు పెంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కౌసల్య’. ఈ సినిమా ద్వారా వర్ధమాన సంగీత దర్శకుడు మహేష్‌ ఆపాల దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, ప్రతాని రామకృష్ణ గౌడ్ కలిసి బిగ్ సిడీను ఆవిష్కరించారు. టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆడియో సీడీలను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

నారాయణరావు మాట్లాడుతూ "ఈ సినిమాలో హీరో ఒకరు నా మనువడు. సినిమా ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. ఇటీవల రాజకీయాలకు, సినిమాలకు మధ్య అవినాభావన సంబంధం ఉన్నట్లనిపిస్తుంది . ఎందుకంటే రాజకీయనాయకులు నమ్మసఖ్యం కాని హామీలిస్తుంటే జనాలు వోట్లు వేస్తున్నారు. అలానే నమ్మసఖ్యం కాని చిత్రాలను తెరకెక్కిస్తుంటే ప్రజలు వాటినే ఆదరిస్తున్నారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రావాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే హీరోలు కొత్తవారైనా బాగా నటించారు. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది. కొంతమంది నిర్మాతలు వారి కుమారులనే హీరోలుగా పెట్టి  సినిమాలను నిర్మించి థియేటర్లు ఆక్యుపై చేస్తున్నారు. వారు చిన్న సినిమాలను కూడా కాస్త ప్రోత్సాహం అందించాలి. ఈ చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

అశోక్ కుమార్ మాట్లాడుతూ "ట్రైలర్ చూస్తుంటే హారర్ సినిమా అని తెలుస్తుంది. మహేష్ బాగా డైరెక్ట్ చేసాడు. హీరోలు కొత్త కుర్రాల్లైనా వారి శక్తిమేర నటించారు. సినిమాలో పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి" అని చెప్పారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ "సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. నిర్మాతలు మంచి అభిరుచి కలవారని తెలుస్తోంది. ఫోటోగ్రఫీ బావుంది. థియేటర్స్ విషయంలో ఈ సినిమాకు కావాల్సిన సపోర్ట్ చేస్తాం" అని చెప్పారు.

కాంతారావు మాట్లాడుతూ "సినిమాలో పాటలు బావున్నాయి. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరోలు శరత్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ రంజన్‌, అజయ్‌ దీవా, విక్రమ్‌ మాట్లాడుతూ "ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.

నిర్మాతలు మధుసూదన్‌ సామల, రమేష్‌ బాబు పెంట మాట్లాడుతూ "ఇది మా తొలి చిత్రం. డైరెక్టర్ ని నమ్మి సినిమా చేసాం. డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే బాగా తీసారు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆడియోను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకుడు మహేష్‌ ఆపాల మాట్లాడుతూ "ఈ చిత్ర నిర్మాతలు లేకుంటే ఈ సినిమా లేదు. రవికుమార్ పూడి సహకారం మరువలేనిది. రామేష్ గారు మంచి ప్రోత్సాహం అందించారు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రానికి డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ కూడా అందించాను. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. లైఫ్ ఈజ్ అన్ ప్రెడిక్టబుల్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

నివాస్ మాట్లాడుతూ "శుభప్రదమైన టైటిల్. పాటలు, ట్రైలర్స్  కొత్తగా ఉన్నాయి" అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, అక్షర నయన(బేబీ) పాల్గొన్నారు.

స్నేహ,జబర్‌దస్త్‌ఫణి, శ్రీధర్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:శ్రీనివాస్‌ పూడూరి కెమేరా:బాపూజీ, ఎడిటింగ్‌:జానకిరామ్‌, పీఆర్వో: కూమారస్వామి(బాక్సాఫీస్‌), కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్‌, ఇ.వినయ్‌, ఆర్ట్‌:విజయ్‌ క్రిష్ణ, పాటలు:సురేష్‌ గంగుల,  స్క్రీన్‌ప్లే: కె.చంద్రశేఖర్‌ సహనిర్మాతలు:రవీందర్‌రెడ్డి చింతకుంట,రవి గుమ్మడిపూడి, నిర్మాతలు: మధుసూదన్‌ సామల, రమేష్‌ బాబు పెంట, కథ-సంగీతం- దర్శకత్వం: మహేష్‌ ఆపాల  

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads