Advertisementt

'ప్రేమికుడు' మూవీ లోగో లాంచ్!

Mon 03rd Aug 2015 03:52 AM
premikudu movie,manas,sanam shetty,kala sandeep  'ప్రేమికుడు' మూవీ లోగో లాంచ్!
'ప్రేమికుడు' మూవీ లోగో లాంచ్!
Advertisement
Ads by CJ

మానస్.ఎన్, సనమ్ శెట్టి జంటగా డిజిపోస్టర్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్షి.ఎన్.రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'ప్రేమికుడు'. ఈ సినిమా లోగోను హీరో మానస్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత దామోదర్ ప్రసాద్ లోగో లాంచ్ చేసారు. ఈ సందర్భంగా..

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మానస్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "2014లో మా బ్యానర్ లో మానస్ తో ఓ సినిమా చేయాలనుకున్నాం. కాని కుదరలేదు. ఈ సంవత్సరం ఎలా అయిన మానస్ హీరోగా మా బ్యానర్ ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ సినిమా లోగో డిజైన్ చాలా బావుంది. ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తుంది" అని చెప్పారు.

నిర్మాత లక్ష్మి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా 60% టాకీ పార్ట్ పూర్తయింది. ఇంకా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయి. విజయ్ బాలాజీ మంచి మ్యూజిక్ ఇచ్చారు, త్వరలోనే చిత్ర ఆడియోను విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

దర్శకుడు కళా సందీప్ మాట్లాడుతూ "లవ్, క్రైమ్, కామెడీ నేపధ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈతరం యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న ఈ చిత్రం 60% వరకు టాకీ పార్ట్ మరియు బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో కొత్త లోకేషన్స్ లలో రెండు సాంగ్స్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. జరిగిన రెండు షెడ్యూల్స్ లలో నటీనటులు, టెక్నీషియన్స్ సహాయ సహకారములతో సకాలంలో పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అజీజ్ కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుంది. హీరో మానస్ ఏకసంతాగ్రహి. ఏ సన్నివేశంలో అయిన అవలీలగా నటిస్తాడు. కథను పెట్టుబడిగా పెట్టి ఈ సినిమాను మొదలుపెట్టాం. ఇదొక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది" అని చెప్పారు.

హీరో మానస్ మాట్లాడుతూ "ఈ సినిమా టైటిల్ చెప్పగానే చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఎక్కడ కాంప్రమైస్ అవ్వకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు యూత్ ఫుల్ టీమ్ పనిచేసారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరోయిన్ సనమ్ శెట్టి మాట్లాడుతూ "ప్రేమికుడు మూవీ మానస్ కు మంచి గిఫ్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు నాకు కథ చెప్పగానే బాగా నచ్చింది. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పద్మిని, టి.ప్రసన్న కుమార్, కాదంబరి కిరణ్, గజల్ శ్రీనివాస్, మోహన్ వడ్లపట్ల, బాసిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, సుధాకర్ కోమాకుల, సన, అనితా చౌదరి, జోశ్యభట్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్: శివ.కె, మాటలు: మోహన్, పాటలు: శ్రీరాం తపస్వి, ఎడిటర్: మధు, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాత: లక్ష్మి.ఎన్.రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- కళా సందీప్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ