Advertisementt

'జేమ్స్‌ బాండ్‌' మూవీ సక్సెస్‌ మీట్‌!

Sat 01st Aug 2015 11:07 AM
james bond,allari naresh,sai kishore maccha,anil sunkara  'జేమ్స్‌ బాండ్‌' మూవీ సక్సెస్‌ మీట్‌!
'జేమ్స్‌ బాండ్‌' మూవీ సక్సెస్‌ మీట్‌!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్, సాక్షి చౌదరి జంటగా ఏ.కె ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై సాయికిషోర్ మచ్చ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'జేమ్స్ బాండ్' నేను కాదు నా పెళ్ళాం అనేది ఉపశీర్షిక. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో... 

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ''నేను సక్సెస్‌ వచ్చినపుడు కంటే ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు ఎక్కువగా విమర్శించుకుంటాను. ప్రతి మనిషికి చిన్న టెన్షన్‌ అనేది ఉంటుంది. ఆ టెన్షన్‌లో తప్పులు చేస్తుంటాడు. అలాగే నేను కూడా 50 సినిమాలకు దగ్గర పడుతున్నాననే టెన్షన్‌లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానేమో అనిపిస్తుంది. ఆ టెన్షన్‌ ఈ సినిమాతో తీరిపోయింది. అనిల్‌సుంకరగారు, కొత్త దర్శకుడైన సాయికిషోర్‌ నాకు సక్సెస్‌ ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా విజయంలో సాక్షిచౌదరి కూడా కీ రోల్‌ పోషించింది. ఈ విజయాన్ని డి.రామానాయడుగారికి, మా నాన్నగారు ఇ.వి.వి.సత్యనారాయణగారికి, జంధ్యాలగారికి అంకితం చేస్తున్నాను'' అని అన్నారు. 

దర్శకుడు సాయికిషోర్‌ మచ్చ మాట్లాడుతూ ''ఈ సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌.  టీమ్‌ లో ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్‌ చేశారు. దర్శకుడికి గౌరవం ఇచ్చే హీరో అల్లరి నరేష్‌తో నా తొలి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది'' అని అన్నారు. 

అనిల్‌ సుంకర మాట్లాడుతూ ''ఈ సినిమాలో నరేష్‌ అల్లరే కాదు, మనకు నవ్వులు కూడా బ్యాక్‌ అయ్యాయి. యూనిట్‌ అందరూ మొదటి నుండి సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా కోసం సాక్షిచౌదరి కష్టపడి నటించింది. సాయికార్తీక్‌ మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. శ్రీధర్‌ సీపాన మంచి డైలాగ్స్‌ ఇచ్చాడు. సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కిషోర్‌, మహేష్‌, పృథ్వీ, శ్రీధర్‌ సీపాన, వెన్నెల రామారావు, రఘుబాబు, ఖయ్యూమ్‌, సాయికార్తీక్‌, కృష్ణ మాయ సహా యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ