ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అల్లరి నరేష్, సాక్షిచౌదరి జంటగా మచ్చ సాయి కిషోర్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందించిన చిత్రం ‘జేమ్స్‌బాండ్’. ఈ నెల 24న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ "సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి రిజల్ట్ వస్తుందనుకున్నామో.. ఈరోజు మా చిత్రానికి అదే రిజల్ట్ వచ్చింది. అన్ని ఏరియాస్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్ కు, హీరోకు మంచి పేరొస్తుంది. ఆన్ స్క్రీన్ రెస్పాన్స్ అయితే అధ్బుతం. ఈ మధ్యకాలంలో నరేష్ నటించిన చిత్రాల్లోకెల్లా మంచి హిట్ ను ఇచ్చిన చిత్రమిదే. ఈ సినిమా దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన అక్కడన మాత్రం షూటింగ్ చేయలేదు. సినిమా ఇరవై శాతం షూటింగ్ బ్లూ మ్యాట్ తోనే చేసాం. శనివారం నుండి సినిమా సక్సెస్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ టూర్ల వలన సినిమాపై చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఎక్కువ బడ్జెట్ లో తీస్తే హిట్ కాకపోయుండచ్చు. మేము అనుకున్న బడ్జెట్ లో తీసినందుకే హిట్ అయింది. మా బ్యానర్ లో నెక్స్ట్ సునీల్ తో, హీరో నానిలతో వర్క్ చేయనున్నాం. నేను మంచి స్క్రిప్ట్ దొరికితే డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు.