జై, ఆండ్రియా జంటగా నటించిన చిత్రం 'ఛాలెంజ్'. ఎమ్.శరవణన్ దర్శకత్వం వహించించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని జై మారుతి పిక్చర్స్ పతాకంపై నిర్మాత గోపీచంద్ పండగ తెలుగులో అనువదించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..
కొడాలి వెంకటేశ్వరావు మాట్లాడుతూ "ఛాలెంజ్ సినిమాను నిజంగా చాలెంజింగ్ గా తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో పెద్ద సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా గోపీచంద్ గారు రూపొందించారు. వెన్నెలకంటి మంచి డైలాగ్స్ రాసారు. చంద్రబోసు, వెన్నెలకంటి మంచి సాహిత్యాన్ని అందించారు. జర్నీ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడే ఈ చిత్రానికి కూడా పని చేసాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను" అని అన్నారు.
నిర్మాత గోపీచంద్ పండగ మాట్లాడుతూ "జూలై 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, మ్యూజిక్ డైరెక్టర్: డి.ఇమ్మాన్, ఎడిటర్: సుబ్బరక్, ప్రొడ్యూసర్: గోపీచంద్ పండగ, డైరెక్టర్: ఎమ్.శరవణన్.