Advertisement
Banner Ads

'హొరా హొరి' ఆడియో రిలీజ్!

Thu 30th Jul 2015 07:38 AM
horahori audio launch,dileep,daksha,teja,damodar prasad  'హొరా హొరి' ఆడియో రిలీజ్!
'హొరా హొరి' ఆడియో రిలీజ్!
Advertisement
Banner Ads

దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ' 'హొరా హొరి'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బుదవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుమంత్ అశ్విన్, నాగ శౌర్య, రాహుల్, ప్రిన్స్, హరీష్ విడుదల చేసారు. సుమంత్ అశ్విన్ ఆడియో సీడీలను విడుదల చేసారు. కళ్యాన్ కోడూరు సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..

గుణశేఖర్ మాట్లాడుతూ "తేజ ఏ సినిమా డైరెక్ట్ చేసిన ఇండస్ట్రీకు కొత్త నీరు వస్తుంది. ఈ సినిమా ద్వారా కూడా అందరు అదే ఆశిస్తున్నారు. తేజ నేను చాలా రోజులు రూమ్మేట్స్ గా ఉన్నాం. ఆ సమయంలోనే తెలిసింది తను ఎంత గొప్ప టెక్నీషియన్ అనేది. తేజ మాత్రం మంచి సినిమా చేయడానికి కథ కూడా అవసరం అని నమ్మాడు. తన కథల్లో మనం ఇంటెన్సిటీను చూడొచ్చు. తన సినిమాలు కొన్ని ఫ్లాప్స్ అయినా టెక్నీషియన్ గా మాత్రం తను ఫ్లాప్ కాలేదు. కళ్యాన్ మంచి సంగీతాన్నిస్తారు. ఈ బ్యానర్ పేరు వింటుంటే తొలి కోడి కూసింది సినిమా గుర్తొస్తుంది. అలా మొదలైంది తో ఈ బ్యానర్ మరలా రావడం చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ "తేజ సినిమా కోసం హొరా హొరీ గా పోరాడుతాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్న నటీనటులుగా కూడా అంతే. దిలీప్ కూడా గొప్ప హీరో అవుతాడు. దామోదర్ ప్రసాద్ ప్రతి సినిమాను చాలెంజింగా తీసుకుంటాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుంది" అని అన్నారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ "తేజ తెలివితేటల్లో 50 శాతం నాకుంటే ఇప్పటికి 100 సినిమాలు చేసేవాడిని. తేజ ఒక అధ్బుతం. ఈ ఆడియో ఫంక్షన్ కు నన్ను పిలిస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. దాము నేను 25 ఏళ్ళుగా మంచి స్నేహితులం. వీరు చేసిన సినిమా హిట్ కావాలి" అని చెప్పారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ "నాకు తేజ అంటే చాలా ఇష్టం. నాకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు తేజ నాతోనే ఉన్నాడు. ఆయన చేసిన జయం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

తేజ మాట్లాడుతూ "చాలా మంది ఈ సినిమా ట్రైలర్ చూసి జయం సినిమాలా ఉందని అంటున్నారు. ఆమాటలు వింటుంటే నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకు జయం తీశానురా బాబు అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా జయం లాంటి సినిమా తీయొచ్చు కదా అంటున్నారు. నా జీవితం జయం తో స్టార్ట్ అయ్యి జయంతో ఎండ్ అయ్యేట్లుంది. అంతకముందు తరువాత చాలా తీసా. ఇప్పుడు తేజ అంటే లవ్ స్టోరీస్ మాత్రమే చేయగలడు అంటున్నారు. కాని వేరే సినిమాలు కూడా చేసాను. గత పది సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న నేను ఈ మధ్యనే అగ్రెసివ్ గా తయారయ్యాను. ఈ సినిమాలో కూడా నా అగ్రెసివ్ నెస్ కనిపిస్తుంది. ఈ మధ్య అన్ని ఒకే తరహలో ఉన్న చిత్రాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలకు రివ్యూలు కూడా బాగా ఇస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే లైట్ లు, మేకప్ లు లేకుండా సినిమా చేసాం. కావాలని చేయలేదు. పశ్చిమ కనుమల్లో సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమా కోసం రెయిన్ మెషిన్ తయారుచేసాం. ఆ మెషిన్ ఆన్ చేసినపుడు ఫ్యూజ్ పోవడం వలన లైట్ లేకుండా తీసాం. కళ్యాన్ కోడూరు నేను చాలా సార్లు కొట్టుకున్నాం. అయినా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా నాతో పని చేయడం టార్చర్. మద్రాస్ లో పుట్టి పెరగడం వలన నాకు తెలుగులో పెద్ద కంట్రోల్ లేదు. అందుకే నాకు అర్ధమయ్యేట్టు రాయమని పెద్దాడమూర్తితో చెప్పాను. నాలాంటి వాడితో పని చేయడం కంటే మిగిలిన వారితో పని చేయడం సులభంగా ఉంటుంది" అని చెప్పారు.

కళ్యాన్ కోడూరి మాట్లాడుతూ "ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. ప్రతి పాట చేయడానికి తేజ గారి ఇన్స్పిరేషన్ ఎంతైనా ఉంది. చచ్చిపోవాలనుంది అనే పాటను ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ అంకితమిస్తున్నాను" అని అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా గురించి చెప్పినపుడు మీరిద్దరు సినిమా ఎలా చేస్తారులే అని చాలా మంది అన్నారు. ఇద్దరం కలిసి సినిమాను పూర్తి చేసాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందించాలి. నేను ఈరోజు నిర్మాతగా నిలబడ్డానంటే దానికి కారణం మా నాన్నగారు, నా కుటుంబ సభ్యులే. నా సహనిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.

దిలీప్, దక్ష మాట్లాడుతూ "మా తొలి చిత్రాన్నే టాప్ డైరెక్టర్ తో చేయడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.

Advertisement
Banner Ads

Loading..
Loading..
Loading..
Advertisement
Banner Ads