డైలాగుల్లేని చిన్నా చితకా వేషాలు వేసి 'మర్యాద రామన్న' చిత్రంలో చేసిన బైర్రెడ్డి క్యారెక్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రభాకర్ లేటెస్ట్‌గా 'బాహుబలి'లో చేసిన కాళకేయుడి క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. టి.వి. ఛానల్స్ పోటీపడి మరీ అతని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. మర్యాద రామన్న తర్వాత అడపా దడపా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న ప్రభాకర్ కోసం ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారనే చెప్పాలి. అయితే నెక్స్‌ట్ చెయ్యబోయే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగెయ్యాలని నిర్ణయించుకున్న ప్రభాకర్ సెలెక్టివ్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలోని కాళకేయుడు క్యారెక్టర్‌కి వస్తున్న గురించి అతన్ని అడిగితే 'మర్యాద రామన్నలో బైర్రెడ్డి క్యారెక్టర్ చేసినా, బాహుబలిలో కాళకేయుడు క్యారెక్టర్ చేసినా అదంతా రాజమౌళిగారి చలవే. నటన రాని నాకోసం ఎంతో ఖర్చు పెట్టారు. నాకు అన్నీ నేర్పించారు. అనుకోకుండా సినిమా ఫీల్డ్‌కి వచ్చిన నాకు మంచి జీవితాన్ని ప్రసాదించిన రాజమౌళిగారు నాకు దేవుడితో సమానం. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను' అంటూ ఎంతో వినయంగా చెప్తున్న ప్రభాకర్ 'బాహుబలి2'లో కూడా తన క్యారెక్టర్ వుందంటున్నాడు. ఫస్ట్ పార్ట్‌లోనే కాళకేయుడు క్యారెక్టర్ అంతమైపోయింది కదా! సెకండ్ పార్ట్‌లో ఎలా వస్తారు అని అడిగిన ప్రశ్నకు 'సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది' అని చెప్తున్నాడు. ప్రస్తుతం బాహబలి2 షూటింగ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు ప్రభాకర్.