సినిమాల్లో హీరోలని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎక్కువగా ఫైటింగ్ సన్నివేశాలే పెడుతుంటారు. ప్రతినాయకుడు రెచ్చిపోతున్న సమయంలో హీరో ఓ రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చేసి ఇరక్కుమ్మేస్తుంటాడు. అప్పుడు చూడాలి ఫ్యాన్స్ హంగామా. థియేటర్లలో ఈలలు కేకలే. మరి 'సర్దార్'లో పవన్‌కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆయన సెట్లోకి మాత్రం ఫైటింగ్‌తోనే ఎంట్రీ ఇచ్చాడు. 'గబ్బర్‌సింగ్'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'సర్దార్' చిత్రీకరణ చాలా రోజుల కిందే మొదలైంది. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఎపిసోడ్‌ని తీసొచ్చారు. అప్పుడే పవన్ చిత్రీకరణలో పాల్గొంటాడని మాట్లాడుకొన్నారు. కానీ ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆ షెడ్యూల్‌కి హాజరు కాలేకపోయాడు. దీంతో విలన్ బృందంపైనే సన్నివేశాలు తీశారు. రెండో షెడ్యూల్ నుంచి పవన్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బుధవారం నుంచే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. పవన్‌పై తొలి రోజు యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. మొదటిరోజే పవన్‌తో ఫైటింగులు చేయించారన్నమాట. హైదరాబాద్‌లో ఓ ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో పవన్, ఇతర విలన్ బృందంపై సీన్స్ తీస్తున్నారు. మరో పది రోజులపాటు అక్కడే షెడ్యూల్ జరిగే అవకాశాలున్నాయి. అయితే యేడాది రెండేళ్లుగా ఈ సినిమా పనులు జరుగుతున్నప్పటికీ నేటికీ హీరోయిన్‌ని సెలక్ట్ చేసుకోలేదు. ఆమధ్య ఓ హీరోయిన్‌ని సెలెక్ట్ చేసుకొన్నాడు పవన్. కానీ ఏమైందో ఏంటో ఆమెని మధ్యలోనే తొలగించేశారు. ఇప్పుడు కాజల్ నటిస్తోందని ప్రచారం సాగుతోంది. కానీ చిత్రబృందం మాత్రం ఆ విషయం గురించి నోరు మెదపడం లేదు. హీరోయిన్ పార్ట్ షూటింగ్ మొదలయ్యేవరకు ఆ వివరాలు బయటికొచ్చే అవకాశాల్లేవేమో మరి! పవన్‌కళ్యాణ్ సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. ఈ సంక్రాంతికి `గోపాల గోపాల`తో అలరించాడు పవన్. వచ్చే సంక్రాంతికి `సర్దార్`. చూస్తుంటే పవన్ యేడాదికో సినిమా మాత్రమే చేసేలా కనిపిస్తున్నాడు. పవన్ చాలా రోజులుగా గెడ్డంతో ఉన్నాడు. ఇప్పుడు షూటింగ్ మొదలైంది కాబట్టి ఆ గెడ్డం తీసేసుంటాడు. ఆ నయా గెటప్‌లో ఆయన ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.