Advertisementt

"మిస్టర్ కె" మూవీ ప్రారంభం!

Wed 29th Jul 2015 07:55 AM
mister k,koushik babu,sashank voleti,hareesh rao
"మిస్టర్ కె" మూవీ ప్రారంభం!
Advertisement

ది వేవ్స్ క్రియేషన్స్ పతాకంపై కౌశిక్ బాబు టైటిల్ పాత్రలో శశాంక్ వోలేటి దర్శకత్వంలో లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "మిస్టర్ కె". 'ఖాకి సత్తా' అనేది ఉపశీర్షిక. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణరాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు క్లాప్ ఇవ్వగా, ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణ దాస్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

టి.హరీష్ రావు మాట్లాడుతూ "రాష్ట్రం కోసం, దేశం కోసం నల్గొండలో పోలీస్ అధికారి సిద్దయ్య ప్రాణాలు అర్పించాడు. అతని కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం "మిస్టర్ కె". వాస్తవాలకు దగ్గరగా ఇలాంటి చిత్రాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సామాజిక పరివర్తన కోసం తమవంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు త్యాగాలను, మంచితనాన్ని చూపించే చిత్రాలు రావాలి. చిత్రాలంటే లవ్, క్రైమ్, థ్రిల్లర్ కాదు. తెలుగు ముద్దుబిడ్డ కౌశిక్ బాబు కేరళలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కౌశిక్, సంపత్ రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సహాలను అందిస్తుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాల చిత్రీకరణకు హైదరాబాద్ అనువైన నగరం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని అన్నారు.   

డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. "పోలీస్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. కొత్త దర్శకుడు శశాంక్ వోలేటి, కౌశిక్ బాబు, మిస్టర్ కె చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్" అని అన్నారు. 

దర్శకుడు శశాంక్ వోలేటి మాట్లాడుతూ "కామెడీతో నవ్వించి, సెంటిమెంట్ తో ఏడిపించి, యాక్షన్ తో అరిపించే కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం" అని అన్నారు.        

కౌశిక్ బాబు మాట్లాడుతూ "మంచి విలువలతో కూడిన కథ. సిద్దయ్య ఏవిధంగా ప్రాణత్యాగం చేశాడో తెలుసు. అతనితో పాటు పోలీసుల గొప్పతనం తెలియజేసే విధంగా చిత్రం ఉంటుంది. ఖాకి సత్తా తగ్గకుండా మా పాత్రలను దర్శకుడు డిజైన్ చేశారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుతున్నాను" అని అన్నారు.    

ఈ చిత్రానికి కథ : శారదా విజయబాబు, మాటలు : మోహన్ దీక్షిత్, కళా దర్శకుడు : మోహన్ జెల్లా, ఎడిటర్ : వెంకట రమణ, సంగీతం : నాగ్ శ్రీవత్స, ఛాయాగ్రహణం : దీపక్ డి మీనన్, నిర్మాతలు : లోకేష్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్.చిట్టిబాబు, వి.రామచంద్ర మూర్తి. కథనం - దర్శకత్వం : శశాంక్ వోలేటి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement