ఏ సినిమాకైనా ప్రమోషన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సినిమా నిర్మాణం ఒక ఎత్తయితే, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం మరో ఎత్తుగా మారింది. ప్రస్తుతం టి.వి.లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ని వదిలి థియేటర్‌కి ప్రేక్షకులు రావడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది ఈమధ్యకాలంలో థియేటర్‌కి రాని ప్రేక్షకుల్ని సైతం రప్పించిన చిత్రం 'బాహుబలి'. ఒక సినిమా ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే పబ్లిసిటీ ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయంలో 'బాహుబలి' మినహాయింపు తీసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన స్టిల్స్, ట్రైలర్స్, మేకింగ్ వీడియోస్‌తో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఎంత బడ్జెట్‌తో తీసిన సినిమాకైనా డైలీ పేపర్స్‌లో యాడ్స్ ఇస్తారు. కానీ, 'బాహుబలి' చిత్రానికి మాత్రం అలా జరగలేదు. టి.వి. ఛానల్స్‌కి కూడా యాడ్స్ ఇవ్వకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పుడు 'శ్రీమంతుడు' కూడా అదే దారిలో వెళ్తున్నట్టు ఈ సినిమా పబ్లిసిటీ పంథా చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్, ప్రోమోస్‌ను వరసగా రిలీజ్ చేస్తున్నారే తప్ప పేపర్ పబ్లిసిటీనిగానీ, ఛానల్ పబ్లిసిటీనిగానీ, వెబ్ పబ్లిసిటీనిగానీ పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఒకటి, రెండు ఛానల్స్‌లో తప్ప ఈ చిత్రానికి సంబంధించిన యాడ్స్ కనిపించడం లేదు. ఫ్రీ పబ్లిసిటీతోనే ఈ చిత్రాన్ని కూడా గట్టెక్కించాలని చూస్తున్నారు నిర్మాతలు. 'బాహుబలి' చిత్రానికి బాగా ఉపయోగపడిన ఈ పద్ధతి 'శ్రీమంతుడు'కి ఎంత వరకు లాభిస్తుందో చూడాలి.