Advertisementt

మరో అయిదేళ్ళు ప్రభాస్ బుక్కయ్యాడు!?

Tue 28th Jul 2015 03:13 AM
prabhas mahabharatham,rajamouli mahabharatham,prabhas bahubali,prabhas rajamouli  మరో అయిదేళ్ళు ప్రభాస్ బుక్కయ్యాడు!?
మరో అయిదేళ్ళు ప్రభాస్ బుక్కయ్యాడు!?
Advertisement
Ads by CJ

రాజమౌళి ఎప్పుడు కోరినా ఎంతటి హీరోలు అయినా వరస కట్టి లైన్లో నిలబడడమే కాకుండా ఏళ్ళ తరబడి కాల్షీట్లు ఇచ్చేయడానికి సదా సిద్ధంగా ఉంటారు. బాహుబలి కోసం మూడేళ్ళు అప్పనంగా రాజమౌళికి అప్పగించిన ప్రభాస్ పట్ల అతని అభిమానులు మొదట్లో కొంత కోపంగా ఉన్నప్పట్టికీ ఇప్పుడు బాహుబలి పుణ్యమాని అన్ని రికార్డులు సర్ఫ్ ఎక్సెల్  వైట్ వాష్ అవడంతో తమ హీరో తిరుగులేని సంచనాలను చూస్తూ అదే అభిమానులు గర్వపడుతున్నారు. బాహుబలి రెండవ పార్ట్ కోసం ప్రభాస్ మరో ఏడాది పని కూడా రానున్న  నెల రోజుల్లో ప్రారంభం అవుతుండడంతో రెబెల్ స్టార్ అభిమానులు తమ రికార్డులను తామే ఇరగేసుకుంటామని ఘంటాపథంగా చెప్పేస్తున్నారు.

ఇవన్ని ఒక ఎత్తయితే రాజమౌళి మరో రెండేళ్ళ కాలవ్యవధిలో మహాభారతానికి రూపురేఖలు చెక్కబోతున్నాడు అన్నది లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. బాహుబలి అందించిన విజయోత్సాహంతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి జక్కన్న సన్నద్ధం అవుతున్న వేళ ఆ మహాకావ్యంలో నటించే ఎటువంటి నటీనటులు అయినా కనీసం అయిదు సంవత్సరాలు తనతో ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న నియమం పెట్టబోతున్నాడట. రాజమౌళి సినిమా రుచి, అభిరుచి ఏంటో అందరికంటే బాగా తెలిసినవాడు ప్రభాస్ గనక మహాభారతం కోసం అందరి కన్నా ముందు తనకు ఏ పాత్ర ఇస్తారో చెప్పాలని, అందుకు అయిదంటే అయిదు ఆరంటే ఆరు ఏళ్ళు కట్టుబానిసలాగా పని చేస్తానని రాజమౌళికి కట్టప్ప అంత విశ్వాసం చూపాడట మన రెబెల్ స్టార్. పనికిరాని సినిమాలు పదుంటే ఏంటి ఇరవై ఉంటె ఏంటి, పనికొచ్చే ఒక్క బాహుబలి, ఒక్క మహాభారతం చాలదంటారా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ