Advertisementt

దేవీ, ఏమిటా మోటు సరసం!!!

Mon 27th Jul 2015 11:54 AM
devi sri prasad,cinemaa awards devi sri prasad,dsp stage show,dsp songs  దేవీ, ఏమిటా మోటు సరసం!!!
దేవీ, ఏమిటా మోటు సరసం!!!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో దేవిశ్రీప్రసాద్ బ్రాండుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్నతనంలోనే పెద్ద పేరు సంపాదించి మణిశర్మ, కీరవాణి లాంటి వారిని కూడా దాటేసి బడా ఆఫర్లు అందుకోవడంలో ముందు వరసలో నిలుచొని ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ నుండి చిరంజీవి, బాలకృష్ణ వరకు స్టార్ హీరోలందరికీ దేవియే దిక్కన్నట్టుగా సాగుతోంది ఇతగాడి ప్రయాణం. మ్యూజికల్ హిట్స్ ఇవ్వడం దేవికి కొత్తేమీ కాదు అలాగే ఏ ఫంక్షన్ అయినా ఏ స్టేజి అయినా మైక్ పట్టాడంటే శ్రోతలు ఉర్రూతలూగే వరకు వదలడు. 

మొన్న జరిగిన సినీ మా అవార్డ్స్ కార్యక్రమంలో కూడా హవా అంతా దేవిదే. తన సూపర్ హిట్ నంబర్లని ఒక్కొక్కటిగా పాడుతూ మొత్తం వాతావరణాన్ని హుశారేక్కించి పారేసాడు. మరి మాస్ పాటలు దంచి కొడుతుంటే పక్కన నర్తించే డ్యాన్సర్లు కూడా సెగ పుట్టించేలా ఉంటె, ఆ మజాయే వేరు కదా. అందుకే పనిలో పనిగా ఇదిగో ఇలా ఓ పాటేసుకుని ఓ కత్తి డ్యాన్సరుని వాటేసుకున్నాడు. పాపం అమ్మడు ఎవరో కానీ దేవీ టచ్ ఒక్కటే చాలన్నట్టుగా వగలు పోయింది. ఎంజాయ్ చేస్తున్న వాళ్ళిద్దరికీ ఏ నొప్పి లేదుగాని, హావభావాలు చూస్తున్న సగటు ప్రేక్షకులు మాత్రం దేవి ఉడుం పట్టులో మాంచి మోటు సరసం ఉంది అని లొట్టలు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ