Advertisementt

'అవంతిక' సినిమా ప్రారంభం!

Sun 26th Jul 2015 09:06 AM
avanthika movie,rohan,maneesha,gopi kakarla,uma  'అవంతిక' సినిమా ప్రారంభం!
'అవంతిక' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

రోహన్, మనీషా జంటగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న సినిమా 'అవంతిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొత్తగా నిర్మాత దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. గోపి కాకర్ల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

గోపి కాకర్ల మాట్లాడుతూ "ఇది నా డెబ్యూ మూవీ. 'అవంతిక' ఓ లవ్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్ట్. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారికి ఏర్పడిన సమస్యలను ఎలా అధిగమించారనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. సినిమా అంతా పీస్ ఫుల్ గా రొమాంటిక్ గా రన్ అవుతుంటుంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాసం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్" అని చెప్పారు.

బాలాజీ మాట్లాడుతూ "ఇద్దరి వ్యక్తులు ఒకరినొకరు అర్ధం చేసుకొని ఎలా లైఫ్ లీడ్ చేసారనేదే ఈ సినిమా. అవంతిక అంటే తేజస్సు అని అర్ధం. అలాంటి తేజస్సు కలిగిన అమ్మాయికి చుట్టూ ఉన్న వ్యక్తుల వలన ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. హీరోగా రోహన్ సూట్ అవుతాడని సెలెక్ట్ చేసారు" అని చెప్పారు.

నిర్మాత ఉమ మాట్లాడుతూ "ఆగష్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నాం. అందరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ భోలే మాట్లాడుతూ "ఇదొక మైండ్ గేమ్ మూవీ. వినూత్నమైన సబ్జెక్టు. సినిమాలో మూడు పాటలుంటాయి. డైరెక్టర్ గారు చెప్తే మరొక పాట యాడ్ చేస్తాను. నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.

హీరో రోహన్ మాట్లాడుతూ "ఇందులో నాది లైవ్లీ గా ఉండే లవర్ బాయ్ క్యారెక్టర్. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఉంటుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి రచయిత: గోపి వెంకటేష్, సినిమాటోగ్రపి: ఎస్.వి.శివారెడ్డి, సంగీతం: భోలే, ఎడిటింగ్: వినాయక్, విజువల్ ఎఫెక్ట్స్: జేమ్స్, నిర్మాత: ఉమ, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గోపి కాకర్ల. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ