బాహుబలి ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ నుండి ఎదురయ్యే గట్టి పోటీని ముందే పసిగట్టిన దగ్గుబాటి రానా, అందుకు తగ్గట్టుగానే బాలివుడ్ అంతటా ఈ మ్యాగ్నం ఓపస్ క్రెడిట్ మొత్తం తనది అండ్ రాజమౌళిదే అన్నట్టుగా బిల్డప్పు ఇచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. జరుగుతున్న ప్రమాదాన్ని కొంచెం ఆలస్యంగా గమనించిన ప్రభాస్ తేరుకుని తనదైన స్టయిల్లో ఇపుడు పెదనాన్న కృష్ణంరాజు సలహాలతో ముందు దూసుకు పోతున్నాడు. మీడియా మిత్రులకు ఇచ్చిన విందు, చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్ ఇలా ప్రభాస్ తన ఖాతాలో కొంత క్రెడిట్ మూటగట్టుకున్నాడు.
తాజాగా పెదనాన్నను వెంటబెట్టుకుని న్యూ ఢిల్లీకి పయనమై హొమ్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ గారిని కలవడం ప్రభాస్ తరఫున బాహుబలికి సంచలనమైంది. నువ్వు ముంబైలో పలుకుబడి చూపిస్తే నేను ఢిల్లీలో సత్తా చూపిస్తా అన్నట్టుగా రానా, ప్రభాస్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎటు నుండి చూసినా లాభపడుతోంది మాత్రం బాహుబలి అండ్ రాజమౌళి.