Advertisementt

'ది ఇండియన్ పోస్ట్ మ్యాన్' ఆడియో విడుదల!

Fri 24th Jul 2015 08:35 AM
the indian postman,nayini narasimhareddy,ramesh reddy thummala  'ది ఇండియన్ పోస్ట్ మ్యాన్' ఆడియో విడుదల!
'ది ఇండియన్ పోస్ట్ మ్యాన్' ఆడియో విడుదల!
Advertisement
Ads by CJ

అజయ్ కుమార్, వేద జంటగా దేవెంకి ఫిల్మ్స్ పతాకంపై రమేష్ రెడ్డి తుమ్మల దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న సినిమా 'ది ఇండియన్ పోస్ట్ మ్యాన్'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర హొమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీను దర్శకుడు రమేష్ రెడ్డి కి అందించారు. ఈ సందర్భంగా..

నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ "తెలంగాణా కోసం ఎందరో మహానుబావులు ఉద్యమాలు చేసారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలను సైతం కోల్పోయారు. ఎందరో త్యాగాల ఫలితమే మన తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ. అలాంటి తెలంగాణా కథకు సంబంధించిన సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆడియో, సినిమా మంచి విజయాన్ని సాధించాలి. చిత్ర బృందానికి మంచి పేరు రావాలి" అని చెప్పారు.

దర్శకనిర్మాత రమేష్ రెడ్డి తుమ్మల మాట్లాడుతూ "1969-1972 లో తెలంగాణా నేపధ్యంలో జరిగిన ఓ పోస్ట్ మ్యాన్ ప్రేమకథే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కిస్తున్నాం. ఇది డాక్యుమెంటరీ కాదు ఓ కమర్షియల్ చిత్రానికి హ్యూమన్ టచ్ జోడించి తీసాం" అని చెప్పారు.

హీరో అజయ్ కుమార్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నాకు ఈ అవకశం ఇచ్చిన దర్శకునికి నా థాంక్స్" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: సాయి చంద్, ఎల్.ఎమ్.ప్రేమ్, ఎడిటింగ్: రామారావ్, ఫోటోగ్రఫీ: సురేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నిర్మాత: రమేష్ రెడ్డి తుమ్మల.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ