Advertisementt

రుద్రమదేవి రిలీజ్ డేట్ ఖరారు!

Fri 24th Jul 2015 08:19 AM
rudhramadevi,gunasekhar,anushka,allu arjun  రుద్రమదేవి రిలీజ్ డేట్ ఖరారు!
రుద్రమదేవి రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి ఎన్నో డేట్స్‌ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా సెప్టెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ్‌లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ అదే రోజు విడుదలవుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా సెప్టెంబర్ 4నే విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో అనుష్క, రాగిణి గుణ కలిసి రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ "13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల చరిత్రే ఈ సినిమా. దాదాపు 850 ఏళ్ళ క్రితం జరిగిన ఈ కథను ఏ మాత్రం వక్రీకరించకుండా రూపొందించాం. సుమారు 9 ఏళ్ళ పాటు తోట ప్రసాద్, ముదిగొండ ప్రసాద్, పరుచూరి ప్రసాద్, నేను కలిసి ఈ చరిత్రపై పరిశోధన చేసాం. చిన్నప్పుడు చదువుకున్న 'రుద్రమదేవి' చరిత్ర నాకు చాలా స్పూర్తినిచ్చింది. అందుకే ఆ చరిత్రను చిత్రంగా తెరకెక్కించాను. ఈ సినిమాను ప్రారంభించినపుడు రుద్రమదేవి పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయం నేను వెల్లడించలేదు. కాని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, ఆడియన్స్ అందరూ అనుష్క అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదనే సూచనలు పంపారు. వారంతా భావించినట్లుగానే అనుష్క ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. అనుష్క లేకపోతే 'రుద్రమదేవి' లేదు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, నటనలో ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసింది. ఇక అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో ఇమిడిపోయి నటించాడు. వరుడు సినిమా సమయంలో అల్లు అర్జున్ కి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ సినిమాలో తనదొక బందిపోటు పాత్ర. అసలు తను బందిపోటు గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. సుమారుగా గంట సమయం పాటు బన్నీ గోన గన్నారెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. తన షెడ్యూల్ 35 రోజులయినా గోన గన్నారెడ్డి పాత్ర కోసం ఓ నెల ముందు నుండే చాలా హొమ్ వర్క్ చేసాడు. ఈ చిత్రంలో రానా డిఫరెంట్ గా రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నాడు. నటీనటులు, టెక్నీషియన్స్ మూడు సంవత్సరాలుగా నాకు చాలా సపోర్ట్ చేసారు. 3 డి లో సిజి వర్క్ చేయడం చాలా కష్టం. ఆ పని తెలిసిన వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడానికి కూడా కారణం అదే. కెమెరామెన్ తన వర్క్ తో కథను అధ్బుతంగా ఎలివేట్ చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజులపాటు లండన్‌లో ఈ చిత్రం రీ రికార్డింగ్‌ కార్యక్రమాలు జరిగాయి. లండన్‌లో రీ రికార్డింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 4న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

అనుష్క మాట్లాడుతూ "షూటింగ్ ప్రారంభం నుండి అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో సపోర్ట్ చేసారు. మేము చేసిన హార్డ్ వర్క్ కు ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇస్తారనే భావిస్తున్నాను. ఈ చిత్రం కోసం ఇళయరాజా గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాం" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ