మహాలక్ష్మి మూవీస్ పతాకంపై సభ్యసాచి, మహేష్, కారుణ్య ప్రధాన పాత్రల్లో అవన్ ఆళ్ళ దర్శకత్వంలో దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్న సినిమా 'నీరాజనం'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సముద్ర క్లాప్ కొట్టగా బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
ఎమ్మెల్యే ఆర్.కృష్ణన్ మాట్లాడుతూ "సినిమా అనేది చాలా ముఖ్యమైన మీడియం. వాటి ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. కాబట్టి మంచి చిత్రాలను నిర్మించే బాధ్యత దర్శకులపైనే ఉంది. సమాజానికి సందేశాత్మకంగా, ఉపయోగకరంగా ఉండే చిత్రాలను నిర్మించాలని దర్శకులందరిని కోరుకుంటున్నాను. కొత్త పద్ధతిలో సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకుడు అవన్ ఆళ్ళ మాట్లాడుతూ "రెండు సంవత్సారాల నుండి ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాను. ఇదొక ట్రైయాంగల్, మ్యూజికల్ ఫిలిం. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి" అని చెప్పారు.
నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ "కథ నచ్చి దర్శకుడిపై నమ్మకంతో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
హీరో సభ్యసాచి మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్" అని చెప్పారు.
మహేష్ మాట్లాడుతూ "షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ "డైరెక్టర్ గారు మ్యూజికల్ సినిమా చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకొని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి. గోపి వెంకటలక్ష్మి, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, సినిమాటోగ్రఫీ: మహి శేర్ల, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, మాటలు: రవి. ఐ, నిర్మాత: దాడి అప్పలనాయుడు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అవన్ ఆళ్ళ.