మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలం లో నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు వచ్చిన హార్రర్ సినిమాల్లోకెల్లా డిఫరెంట్‌గా వుంటూ ఆడియన్స్‌ని మరింత థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా వున్నాయి. అలాగే యూత్‌ని ఆకట్టుకునే అనేక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అన్నివిధాలుగా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది’’ అన్నారు.
నిర్మాణ నిర్వాహకులు విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఎడిటింగ్ పూర్తయింది. డబ్బింగ్‌ను ఈ వారంలోనే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే డి.ఐ. వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో చేస్తున్నాము. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా మంచి స్టాండర్డ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఆగస్ట్ నెలాఖరుకల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
ఆదిత్యా ఓం, ప్రకాష్, సుదర్శన్, రోహిత్, నితేష్, మనీషా కేల్కర్, రిచాసోని, సాగరిక చేత్రి, శీతల్ సింగ్, సైదా జూల్, టిమ్సీ గౌతమ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లవన్, వీరల్, కెమెరా: సిద్దార్థ, ఎడిటింగ్: ప్రకాష్, నిర్మాణ నిర్వహణ: విజయ్‌వర్మ పాకలపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిత్య ఓం.