Advertisementt

అనుష్క ఎంత ఫాస్టుగుందో...!!

Mon 20th Jul 2015 04:47 AM
anushka,bahubali,size zero,anushka busy with size zero,   అనుష్క ఎంత ఫాస్టుగుందో...!!
అనుష్క ఎంత ఫాస్టుగుందో...!!
Advertisement
Ads by CJ
`బాహుబ‌లి` ప్ర‌మోష‌న్ల‌లో అస్స‌లు క‌నిపించ‌లేదు జేజ‌మ్మ‌. ఏమైపోయింద‌బ్బా అనుకొన్నారంతా. కానీ ఆమె మాత్రం బుద్ధిగా బ్యాంకాక్‌లో `సైజ్ జీరో` షూటింగ్ చేసుకొంటూ గ‌డిపింది. `బాహుబ‌లి` తొలి పార్ట్‌లో అనుష్క క్యారెక్ట‌ర్ పెద్ద‌గా లేక‌పోవ‌డం, క‌నిపించిన కాసేపు కూడా డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో క‌నిపించాల్సి రావ‌వంతో రాజ‌మౌళి ఆమెని కావ‌ల్సి ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉంచిన‌ట్టు ఆ త‌ర్వాత తెలిసింది. అనుష్కలాంటి బ్యూటీ టీవీల్లోనూ, ప్ర‌మోష‌న్ల‌లోనూ క‌నిపిస్తే ప్రేక్ష‌కులు చాలా ఊహిస్తారు. అదే స్థాయి అందంతో ఆమె తెర‌పై క‌నిపిస్తుందేమో అని భ్ర‌మ‌ప‌డ‌తారు. కానీ రాజ‌మౌళి ఆమెని తెర‌పై చూపించిన విధానం వేరు. అందుకే థియేట‌ర్‌లోకి వెళ్లాక దేవ‌సేన‌గా అనుష్క‌ని చూసి ప్రేక్ష‌కులు డిజ‌ప్పాయింట్ కాకూడ‌ద‌ని రాజ‌మౌళి తెలివిగా ఆమెని ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉంచాడు. హిందీలో కొన్ని ఇంట‌ర్వ్యూలు ఇప్పించాడు మిన‌హా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఆమెని క‌నిపించ‌నీయ‌లేదు. రాజ‌మౌళి తీసుకొన్న ఆ నిర్ణ‌యం అనుష్క‌కి కూడా బాగా క‌లిసొచ్చింది. ఎంచ‌క్కా ఆ గ్యాప్‌లో `సైజ్ జీరో` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంది అనుష్క‌. ఇప్ప‌టికే ఆ సినిమా మొత్తం పూర్తి చేసేసింద‌ట‌. సినిమాకోసం 20 కిలోలు పెరిగింది కూడా. అంత తక్కువ టైమ్‌లో బాడీ షేపులు మార్చేసుకొని అనుష్క కెమెరా ముందుకు రావ‌డ‌డం చిత్ర‌వ‌ర్గాల్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌. పెద్ద సినిమాల్లో చేసిన అనుభ‌వం `సైజ్ జీరో` విష‌యంలో అనుష్క‌కి  బాగా క‌లిసొచ్చిన‌ట్టుంది.  `బాహుబ‌లి`తో స్కోరు చేసిన అనుష్క త్వ‌ర‌లో `రుద్ర‌మ‌దేవి`గా సంద‌డి చేయ‌బోతోంది. ఆ వెంట‌నే `సైజ్ జీరో` వ‌స్తుంది. ఇలా ఒక‌దాని వెంట మ‌రొక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది అనుష్క‌. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ