Advertisementt

న‌య‌న్ జాక్‌పాట్ కొట్టింది

Mon 20th Jul 2015 04:29 AM
nayanatara,maniratnam,maniratnam to direct nayana tara,karthi,dulkar,komali movie   న‌య‌న్ జాక్‌పాట్ కొట్టింది
న‌య‌న్ జాక్‌పాట్ కొట్టింది
Advertisement
Ads by CJ
ఎంత‌మంది కొత్త‌మ్మాయిలు వ‌చ్చినా త‌న‌కు మాత్రం తిరుగులేద‌ని చాటుతోంది న‌య‌న‌తార‌. ప‌లు ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్స్‌ల్లో అవ‌కాశాలు అందుకొంటూ  దుమ్ము రేపుతోంది. గ‌త రెండు మూడేళ్లుగా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది న‌య‌న్‌. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన‌ప్పుడు `ఇక న‌య‌న‌తార కెరీర్ చివ‌రికొచ్చిన‌ట్టే` అని మాట్లాడుకొన్నారంతా. కానీ ఆమె జోరు చూస్తుంటే ఈ హ‌వా మ‌రికొన్నాళ్లు సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. 
తాజాగా న‌య‌న‌తార... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  మ‌ణిర‌త్నం సినిమాలో ఛాన్స్ అందుకొన్న‌ట్టు తెలిసింది. కార్తీ, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో మ‌ణిర‌త్నం ఓ సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకొంటున్నాడు. ఆ సినిమాలో దుల్క‌ర్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టించ‌బోతోంది. కార్తీ కోసం న‌య‌న‌తార‌ని ఎంపిక చేశారు. ఇటీవ‌లే న‌య‌న‌తార క‌థ విని సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేసింద‌ట‌. 
ఆమెకి మ‌ణిర‌త్నం సినిమాలో ఛాన్స్ రావ‌డం ఇది కొత్తేమీ కాదు. `రావ‌ణ్‌`లో ప్రియ‌మ‌ణి చేసిన పాత్ర కోసం మొద‌ట న‌య‌న‌తారనే సంప్ర‌దించార‌ట‌. కానీ న‌య‌న్ అప్ప‌ట్లో ఆ పాత్ర చేయ‌డానికి ఒప్పుకోలేద‌ట‌. దీంతో ప్రియ‌మ‌ణిని ఎంచుకొన్నారు. రెండోసారి మాత్రం మ‌ణితో చేయాల‌ని న‌య‌న్ ఫిక్స‌యిపోయింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `కోమ‌లి` అనే పేరు ప‌రిశీలన‌లో ఉంది. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ