Advertisementt

'శ్రీమంతుడు' మూవీ ఆడియో విడుదల!

Mon 20th Jul 2015 04:20 AM
sreemanthudu movie,koratala siva,mahesh babu,sruthihasan  'శ్రీమంతుడు' మూవీ ఆడియో విడుదల!
'శ్రీమంతుడు' మూవీ ఆడియో విడుదల!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఆడియో శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి ప్రతిమను గంటా శ్రీనివాసరావు కు అందించారు. వివి వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ "శ్రీమంతుడు టైటిల్ చాలా బావుంది. టీజర్, ట్రైలర్ లో మహేష్ చాలా అందంగా ఉన్నాడు. మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకుడిగా ఈ సినిమాకు పని చేస్తున్నాడు. మా సత్యమూర్తి గారి అబ్బాయి దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందివ్వడం చాలా ఆనందంగా ఉంది. యాబై సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు మహేష్ బాబు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

కొరటాల శివ మాట్లాడుతూ "మహేష్ లాంటి నటుడితో పని చేసే అవకాసం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. ప్రొడ్యూసర్స్ కు ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా కోపరేట్ చేసారు. ఫోటోగ్రఫీ అందించిన మది కు స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి గారే రాసారు. దేవి రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. మొదట ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రలో నటించమని జగపతిబాబు గారిని అడగడానికి భయపడ్డాను. కాని కథ విన్న వెంటనే ఆయన నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రుతి టాలెంటెడ్ హీరోయిన్. మహేష్, శ్రుతి ల మధ్య సినిమాలో మంచి కెమిస్ట్రీ కుదిరింది. పెద్ద కాన్వాస్ లో కథ రాయాలని చాలా హోమ్ వర్క్ చేసి ఈ కథను సిద్ధం చేసాను. పెద్ద పాయింట్ ను కమర్షియల్ గా చూపించాం" అని చెప్పారు.

మహేష్ బాబు మాట్లాడుతూ "దేవి మంచి ఆడియో ఇచ్చాడు. 'జాగోర్' సాంగ్ నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది. కొరటాల శివ గారు నాకు చెప్పిన కథను అధ్బుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. మది గారు ఎక్స్ ట్రాడినరి విజువల్స్ ఇచ్చారు. సినిమాలో నటించిన జగపతిబాబు గారికి స్పెషల్ థాంక్స్. కమల్ హాసన్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన కూతురితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రుతి మంచి యాక్టర్, డాన్సర్, సింగర్. ప్రొడ్యూసర్స్ ఈ సినిమాతో పెద్ద నిర్మాతలుగా ఎదగాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

వివి వినాయక్ మాట్లాడుతూ ''ట్రైలర్ చాలా బావుంది. కొరటాల అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్ రైటింగ్ అధ్బుతంగా ఉంటుంది. సినిమాలో పాటలు చాలా బావున్నాయి. నెక్స్ట్ మహేష్ బాబు తో కలిసి 100 కోట్ల బడ్జెట్ లో ఓ పెద్ద సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాను" అని చెప్పారు.

శ్రుతిహాసన్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మంచి టీం. రాకింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు దేవి కు ప్రత్యేక కృతజ్ఞతలు. మహేష్ బాబు అమేజింగ్ కో స్టార్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది" అని చెప్పారు.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ "ఈ సినిమా టీజర్ చూసాక నేను రెండు సైకిల్స్ కొన్నాను. కాని మా చిన్నోడు(మహేష్ బాబు) ఉన్నంత అందంగా నేను కనిపించలేదు. సినిమా విడుదలయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పారు.

గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఈ చిత్రం టీజర్ రెండు మూడు సార్లు చూసాను. మంచి సందేశాత్మకంగా ఉంది. మనుషుల్లో మార్పు రావాలనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీం అందరికి నా అభినందనలు. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ "ఇదొక మల్టీ స్టారర్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని ఒక రేంజ్ లో తీయాలని ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. దేవిశ్రీప్రసాద్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది." అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ "మిర్చి సినిమా తరువాత కోరతల్ శివ గారు నాకు మరో మంచి అవకాసం ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి సాహిత్యం అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

గల్లా జయదేవ్ మాట్లాడుతూ "ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. ఈ సినిమాలో మొదటిసారి నా కొడుకు అశోక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. శ్రీమంతుడు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

శ్రీనువైట్ల మాట్లాడుతూ "మహేష్ అభిమానులలాగానే నేను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. సినిమా పోస్టర్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. దేవి మంచి ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ సినిమాకు ఎసెట్ అవుతుంది. కొరటాల డైరెక్ట్ చేసిన మిర్చి సినిమాకు మించి శ్రీమంతుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రొడ్యూసర్స్ కి ఇది మొదటి సినిమా. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి వారికి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ "సినిమాలో పాటలు చాలా బావున్నాయి. టీజర్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సినిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో విజయనిర్మల, రాహుల్, సుదీర్ బాబు, చిత్ర నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ