Advertisement

'రహదారి' మూవీ ఆడియో లాంచ్!

Sat 18th Jul 2015 05:36 AM
rahadari movie,raj,sreenivasrao,rahul raj,radhamohan  'రహదారి' మూవీ ఆడియో లాంచ్!
'రహదారి' మూవీ ఆడియో లాంచ్!
Advertisement

రాజ్, సేదు, పూజా ప్రధాన పాత్రల్లో రాజ్ దర్శకత్వం వహించిన 'రహదారి' చిత్రాన్ని శ్రేయాస్ మీడియా బ్యానర్ పై జి.శ్రీనివాస్ రావు తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాధామోహన్, సాయి రాజేష్, ప్రసన్న కుమార్, మల్టీ డైమెన్షన్ వాసు కలిసి బిగ్ సిడీను ఆవిష్కరించారు. రాధామోహన్ ఆడియో సిడీలను ఆవిష్కరించి మొదటి ప్రతిమను దర్శకుడు రాజ్ కు అందించారు. రాహుల్ రాజ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియో మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా..

మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ ''శ్రేయాస్ మీడియా ద్వారా వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ చూసినప్పుడే సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పాను. సాంగ్స్ చాలా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. రాహుల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్ గారికి లాభాలు తీసుకురావాలి" అని చెప్పారు.

రాధామోహన్ మాట్లాడుతూ "టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎసెట్ గా నిలుస్తుంది. శ్రేయాస్ మీడియా ఇలాంటి మంచి చిత్రాలను మరిన్ని ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "చిన్న సినిమాలు నిర్మించడానికి భయపడే రోజుల్లో 'ఈరోజుల్లో' అనే చిత్రాన్ని నిర్మించి శ్రీనివాస్ గారు మంచి హిట్ కొట్టారు. ఆ సినిమాతో మారుతి అనే దర్శకుడ్ని ఇండస్ట్రీకు పరిచయం చేసారు. ఈ చిత్రంతో రాజ్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకు పరిచయం కానున్నాడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ "ఇదొక రోడ్ థ్రిల్లర్ మూవీ. సినిమాలో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. పాటలు బాగా కుదిరాయి.  చిన్న సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారు" అని చెప్పారు. 

దర్శకుడు రాజ్ మాట్లాడుతూ "మంచి మ్యూజిక్ ఇచ్చిన రాహుల్ కు, నాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ మణి, ఎడిటర్: వి.టి.విజయన్, పాటలు: వెన్నెల కంటి, ఆర్ట్: మోహన మహేంద్రన్, సంగీతం: రాహుల్ రాజ్, కో.ప్రొడ్యూసర్: దాసరి రాజేష్, ప్రొడ్యూసర్: జి.శ్రీనివాస్ రావు, కథ-దర్శకత్వం: రాజ్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement