Advertisementt

వరల్డ్‌వైడ్‌గా ‘బాహుబలి’ కలెక్షన్‌ డీటైల్స్‌.!

Fri 17th Jul 2015 06:53 AM
telugu movie bahubali,bahubali movie collections,bahubali movie world wide collections,bahubali records  వరల్డ్‌వైడ్‌గా ‘బాహుబలి’ కలెక్షన్‌ డీటైల్స్‌.!
వరల్డ్‌వైడ్‌గా ‘బాహుబలి’ కలెక్షన్‌ డీటైల్స్‌.!
Advertisement

ప్రభాస్‌, రాజమౌళిల ‘బాహుబలి’ కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన కలెక్షన్స్‌ రాబడుతోంది. యు.ఎస్‌లో అన్ని రికార్డుల్నీ క్రాస్‌ చేసి నెంబర్‌వన్‌ గ్రాసర్‌గా ‘బాహుబలి’ వండర్‌ఫుల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆల్‌రెడీ 20 కోట్లకు పైగా ఫస్ట్‌ వీక్‌లోనే రాబట్టింది. హిందీలో 50 కోట్లకు పైగా కలెక్ట్‌ చేస్తూ తెలుగు నుండి హిందీకి వెళ్ళిన చిత్రాల్లో నెంబర్‌ 1గా నిలిచింది. తమిళ్‌నాడులో 25 కోట్ల దిశగా పరుగులు తీస్తూ రికార్డ్‌ సృష్టిస్తోంది. కర్ణాటకలో 6 రోజులకే 18 కోట్ల 69 లక్షల షేర్‌ సాధించి తెలుగు చిత్రాల్లో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. కేరళలో కూడా రికార్డు సృష్టిస్తోంది ‘బాహుబలి’.

6 రోజులకే నైజాంలో 20 కోట్ల 74 లక్షల షేర్‌!!

నైజాంలో ‘బాహుబలి’ చిత్రం కేవలం 6 రోజులకే 20 కోట్ల 74 లక్షల షేర్‌ సాధించి కనీవినీ ఎరుగని కొత్త రికార్డ్‌ సృష్టించింది. ప్రీవియస్‌ ఇండస్ట్రీ హిట్‌ సినిమా ఫుల్‌ రన్‌లో 23 కోట్ల షేర్‌ రాబట్టగా ‘బాహుబలి’ 7 రోజుల్లోనే ఆ షేర్‌ని అధిగమిస్తోంది. ఇది కలా! నిజమా! అని సినీ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. .

నైజాంలో 40 కోట్ల షేర్‌ వచ్చే అవకాశం.!

నైజాంలో ‘బాహుబలి’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ ద్వారా పంపిణీ చేసిన దిల్‌రాజు గతంలో ‘ఖుషి, పోకిరి’ చిత్రాలను పంపిణీ చేసాడు. ఈ రెండు చిత్రాలు అప్పటికి కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత గబ్బర్‌సింగ్‌ కూడా కలెక్షన్లపరంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు బాహుబలి వాటన్నింటినీ మించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతూ నెంబర్‌ 1 చిత్రంగా నిలిచింది. సాధారణంగా పెద్ద సినిమాలు చిన్న సెంటర్స్‌లో రెండు మూడు థియేటర్లలో రిలీజ్‌ అయి మొదటివారంలోపే సింగిల్‌ థియేటర్‌కి వస్తుంటాయి. కానీ, బాహబలి మాత్రం ఒక్కో సెంటర్‌లో నాలుగైదు థియేటర్లలో రిలీజ్‌ అయి రెండో వారంలోకి ఎంటర్‌ అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. నైజాంలో ఈ చిత్రం 40 కోట్లు కలెక్ట్‌ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

మిగతా ఏరియాల్లోనూ రికార్డే.!

సీడెడ్‌లో 6 రోజులకే 11 కోట్ల 50 లక్షల షేర్‌, గుంటూరులో 5 కోట్ల 17 లక్షల షేర్‌, వైజాగ్‌లో 5 కోట్ల 7 లక్షల షేర్‌, ఈస్ట్‌లో 4 కోట్ల 88 లక్షల షేర్‌, వెస్ట్‌లో 4 కోట్ల 30 లక్షల షేర్‌, కృష్ణాలో 3 కోట్ల 43 లక్షల షేర్‌, నెల్లూరులో 2 కోట్ల 12 లక్షల షేర్‌ రావడం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఓ కొత్త రికార్డ్. 

200 కోట్ల దిశగా ‘బాహుబలి’.!

‘బాహుబలి’ కలెక్షన్‌ సునామీకి బాలీవుడ్‌ ఇండస్ట్రీ సైతం షాక్‌ అయింది. ఓ రీజనల్‌ లాంగ్వేజ్‌లో తీసిన ‘బాహుబలి’ వరల్డ్‌వైడ్‌గా ఇలాంటి కలెక్షన్స్‌ని సాధించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 200 కోట్ల దిశగా పరుగు తీస్తున్న రాజమౌళి ‘బాహుబలి’ సృష్టిస్తోన్న వండర్స్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రపంచ సినిమాని ఒక్కసారి మన తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన క్రియేటర్‌ రాజమౌళిని ప్రతి ఒక్కరూ ఎప్రిషియేట్‌ చేస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement