ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆస్కార్ వి.రవిచంద్రన్, ఆస్కార్ ఫిలిం ప్రై. లిమిటెడ్ పతాకంపై ధనుష్ హీరోగా భరత్‌బాల దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం ‘మరియన్’. తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన ఎన్నో మంచి చిత్రాలను ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందించిన శోభారాణి ‘మరియన్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 31 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
శోభారాణి మాట్లాడుతూ "ఎస్.వి.ఆర్. మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి సినిమాలను అందించాం. ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసిన 'మరియన్' చిత్రాన్ని కూడా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. తమిళంలో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ఏ.ఆర్.రెహ్మాన్ ఓ పాట కూడా పాడారు. తెలుగులో కూడా ఆ పాట ఆయనతోనే పాడించాం. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ పాట తమిళంలో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమాలో ధనుష్ అధ్బుతంగా పెర్ఫార్మ్ చేసాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ "సినిమా ట్రైలర్ చాలా బావుంది. తెలుగులో ధనుష్ కు ఎస్.వి.ఆర్ బ్యానర్ కు మంచి హిట్ అవుతుంది" అని చెప్పారు.
టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరు చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.