నానితో కలిసి `భీమిలి కబడ్డి జట్టు`లో నటించిన శరణ్య గుర్తుంది కదా! `కత్తి`లో కళ్యాణ్‌రామ్‌కి చెల్లిగా కూడా నటించింది. తెలుగు చిత్రాలతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా నటించి గుర్తింపును తెచ్చుకొన్న శరణ్య పెళ్లి కూతురైంది. తిరువనంతపురంకి చెందిన డాక్టర్ అరవింద్ కృష్ణన్‌ని ఆమె త్వరలోనే వివాహం చేసుకోబోతోంది. పోయిన ఆదివారం ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకలో తాను, తనకు కాబోయే భర్త కలిసి దిగిన ఓ ఫొటోని ఫేస్‌బుక్ ద్వారా బయట పెట్టింది. సెప్టెంబరులో వివాహ వేడుక జరగబోతోందని ఆమె స్పష్టం చేసింది. శరణ్య బాలనటిగా తెరకు పరిచయమైంది. తమిళ్, మలయాళంలో పలువురు అగ్ర హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఆమె `విలేజ్ లో వినాయకుడు`, `హ్యాపీ హ్యాపీగా ` సినిమాల్లో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.