Advertisementt

ఆగస్ట్ 9న తెలంగాణా స్టార్ క్రికెట్ మ్యాచ్..!

Mon 13th Jul 2015 08:37 AM
telangana star cricket match,chennai stars,akash,nagaraju  ఆగస్ట్ 9న తెలంగాణా స్టార్ క్రికెట్ మ్యాచ్..!
ఆగస్ట్ 9న తెలంగాణా స్టార్ క్రికెట్ మ్యాచ్..!
Advertisement
Ads by CJ

తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సి.ఎం రిలీఫ్ ఫండ్ కొరకు తెలంగాణా స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్  స్టార్ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన వారికి 'కాకతీయ కప్' ను ప్రెజెంట్ చేయనున్నారు. ఈ మ్యాచ్ ఆగస్ట్ 9, 2015 న ఎల్.బి. స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో తెలంగాణా క్రికెట్ టీం కెప్టెన్ ఆకాష్, గౌరావధ్యక్షుడు నాగరాజు, అధ్యక్షుడు సంగ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

ఆకాష్ మాట్లాడుతూ "తెలంగాణా స్టార్స్ తో తెలుగు హీరోలు కలిసి అన్నాదమ్ములుగా ఒక టీం తో ఆడుతున్నాము. తెలుగు వారియర్స్ లో ఉన్న ప్లేయర్స్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొననున్నారు. చెన్నై టీం కెప్టెన్ గా జీవా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్ ను ఆగస్ట్ 9న మధ్యాహ్నం 2 గంటలకు ఎల్.బి.స్టేడియం లో నిర్వహిస్తున్నాం. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలంగాణా సి.ఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడం జరుగుతుంది. అందరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

నాగరాజు మాట్లాడుతూ "ఆగస్ట్ 9 న మధ్యాహ్నం రెండు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకుల వినోదం కోసం డాన్సు ప్రోగ్రామ్స్ తో పాటు, జబర్దస్త్ టీం కామెడీ షో కూడా ఉంది. అన్ని ఏరియాల నుండి వస్తున్న నృత్య కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మ్యాచ్ అనంతరం ఆగస్ట్ 10 నుండి తెలంగాణా సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యానర్ గా మొదటి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం" అని చెప్పారు.

తెలంగాణా స్టార్స్ టీం: ఆకాష్, నిఖిల్, సందీప్ కిషన్, మనోజ్ నందం, ప్రిన్స్, శివారెడ్డి, సంపత్ కుమార్, సంగా అభినయ్, సంపూర్నేష్ బాబు, నాగరాజు, అశ్విని, ధనరాజ్, సత్యం రాజేష్, నల్ల వేణు, దిలీప్.

చెన్నై హీరోస్ టీం: జీవా, ఆర్య, విశాల్, శ్యాం, భరత్, రమణ, విష్ణు, విక్రాంత్, పృథ్వి, అశోక్ సెల్వన్, నందన్ భాగ్యరాజ్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ