Advertisementt

మరోసారి 'మగధీర' గా రామ్ చరణ్!

Mon 13th Jul 2015 04:12 AM
magadheera,yevadu,tollywood,vamsi pydipalli,allu arjun,ram charan  మరోసారి 'మగధీర' గా రామ్ చరణ్!
మరోసారి 'మగధీర' గా రామ్ చరణ్!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ వచ్చి అప్పటివరకు ఉన్న టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసింది. కానీ తమిళంలో ఈ చిత్రాన్ని ‘మావీరన్‌’ అనే టైటిల్‌తో అనువాదం చేసి విడుదల చేశారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ‘ఎవడు’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా ఓకే అనిపించుకొంది. కానీ ఈ చిత్రానికి తమిళంలో ‘మగధీర’ అనే టైటిల్‌ను ఖరారు చేసి విడుదలకు సిద్దం చేస్తున్నారు. దీంతో చూసే ప్రేక్షకులకు కాస్త కన్ఫ్యూజన్‌ రావడం ఖాయం అనిపిస్తోంది. భద్రకాళి ఫిలింస్‌ పతాకంపై భద్రకాళి ప్రసాద్‌ ‘ఎవడు’ అనువాద హక్కులనుకొని ‘మగధీర’ పేరుతో తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అడ్డా వెంకట్రావ్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో తమిళంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. పోస్టర్లు చూస్తే ఇది ఆ ‘మగధీర’ కాదని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు అంటున్నారు. పైగా అల్లు అర్జున్‌ కూడా పోస్టర్లలో కనిపించడం వల్ల మరింత క్లారిటీగా ఉంటుందని, ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ కాకుండా ఉంటారని నిర్మాతలు అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ