Advertisementt

‘సింగం3’ భామలు వీరే..!

Thu 09th Jul 2015 07:29 AM
suriya,singam 3,anushka,shruti haasan,director hari,hansika  ‘సింగం3’ భామలు వీరే..!
‘సింగం3’ భామలు వీరే..!
Advertisement
Ads by CJ
>తమిళ స్టార్‌ హీరో సూర్య కెరీర్‌పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ‘సింగం’ సిరీస్‌లో సినిమాలు తీస్తూ మరలా ఫామ్‌లోకి వస్తున్నాడు. గత కొంతకాలంగా  సూర్యకు వరుసగా ఫ్లాప్‌లే ఎదురవుతున్నాయి. దాంతో మరోసారి ‘సింగం3’ వైపు ఆశగా చూస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. అతను హరినే. సూర్య, హరికు ‘సింగం’ బ్రాండ్‌గా ముద్రపడిపోయింది. అదే తరహాలో సూర్య తనకు నచ్చిన హీరోయిన్‌ను కూడా ‘సింగం’ సిరీస్‌లో భాగస్వామిని చేస్తున్నాడు. ‘సింగం’లో అనుష్క, ‘సింగం2’లో అనుష్క, హన్సికతో రొమాన్స్‌ చేసిన సూర్య తాజాగా ‘సింగం3’లో కూడా అనుష్కనే సెలక్ట్‌ చేసుకున్నాడు. కాకపోతే ‘సింగం2’లో హన్సిక చేసినట్లుగా ఈ సింగం3 లో అనుష్కతో పాటు శృతిహాసన్‌ని కూడా తీసుకున్నాడట. ఈమేరకు సంప్రదింపులు పూర్తయ్యాయని, సూర్య ‘24’ చిత్రం పూర్తికాగానే ‘సింగం3’ మొదలుకానుందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ