శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రాధాన పాత్రల్లో భీమవరం టాకీస్ బ్యానర్ పై శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా 'ఎఫైర్'. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "శ్రీరాజన్ నాకు మంచి స్నేహితుడు. సూర్యకాంతం అనే సినిమా చేస్తున్న సమయంలో నాకొక కథ వినిపించాడు. ఆ కథను రామ్ గోపాల్ వర్మ గారికి వినిపించగానే చాలా కొత్త కాన్సెప్ట్ వెంటనే మొదలు పెట్టండి అని చెప్పారు. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదిరింది. టెక్నీషియన్స్ అంతా డైరెక్టర్ కు ఎంతగానో సపోర్ట్ చేసారు. ఇదొక కొత్త కాన్సెప్ట్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుంది. ఖచ్చితంగా సినిమా అందరికి నచ్చుతుంది" అని చెప్పారు.
శ్రీరాజన్ మాట్లాడుతూ "16 సంవత్సరాలుగా పడుతున్న నా కష్టానికి నాకు సపోర్ట్ గా నిలిచిన నా తల్లితండ్రులకు, నా భార్యకు ధన్యవాదాలు. వారి తరువాత నేను థాంక్స్ చెప్పాల్సిన మరో వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. ఈ సినిమా చేయడంలో నాకు పూర్తి స్వేచ్చనిచ్చారాయన. నా మీద నమ్మకంతో ఏ రోజు సెట్స్ కు రాలేదాయన. ఆ భయంతో చాలా జాగ్రత్తగా సినిమా రూపొందించాను. ఈ సినిమా విషయానికొస్తే హీరో క్యారెక్టర్ లో ఓ అమ్మాయిని పెట్టి లవ్ స్టొరీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ విధంగానే కథను సిద్ధం చేసుకున్నాను. ప్రశాంతి, గీతాంజలి కథ వినగానే నటించడానికి ముందుకొచ్చారు. ఈ చిత్రానికి శేషు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ కర్ణ లేకపోతే ఈ సినిమా లేదు. సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్స్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, ఎన్.శంకర్, వాసుమంతెన, బెక్కం వేణుగోపాల్, వలూరిపల్లి రమేష్, అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సముద్ర, ధనరాజ్, ప్రశాంతి, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, కెమెరా: కర్ణ ప్యారసాని, డి.ఐ-విజువల్ ఎఫెక్ట్స్: రఘు, డైలాగ్స్: అనిల్ సిరిమల్ల, మ్యూజిక్: శేషు కె.ఎం.ఆర్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజన్.