Advertisementt

ఎన్టీఆర్‌, సుకుమార్‌ చిత్రం ప్రారంభమైంది..!

Tue 07th Jul 2015 04:50 AM
ntr,sukumar,rakul preeth singh,london shooting  ఎన్టీఆర్‌, సుకుమార్‌ చిత్రం ప్రారంభమైంది..!
ఎన్టీఆర్‌, సుకుమార్‌ చిత్రం ప్రారంభమైంది..!
Advertisement
Ads by CJ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ఈరోజు(6) లండన్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 20 వరకు ఈ భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ తర్వాత మరో కంట్రీలో 20 రోజు పాటు ఓ షెడ్యూల్‌ చేస్తారు. ఆ తర్వాత 20 రోజుల పాటు హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ వుంటుంది. దీనితో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చాలా కొత్తగా కనిపిస్తారని దర్శకుడు సుకుమార్‌ చెప్పారు. 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌లతోపాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: విజయ్‌ కె.చక్రవర్తి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ