>ఎస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారు సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై , మిర్చి, రన్‌రాజారన్, జిల్ లాంటి హ్యట్రిక్ సూపర్‌డూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న క్రేజి ప్రోడక్షన్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం-1 గా రూపోందిస్తున్న ఫ్యామిలి అండ్ లవ్ ఎంటర్‌టైనర్ "భలే భలే మగాడివోయ్". నాని, లావణ్య త్రిపాఠి లు జంటగా నటిస్తున్నారు. వరుస విజయాలతొ యూత్ లో ఐకాన్ డైరక్టర్ గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియస్ట్ డైరక్టర్ మారుతి దర్శకుడు. హ్యట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బన్నివాసు నిర్మాత. రెండు పాటల షూటింగ్ మినహ చిత్రం షూటింగ్ కార్యక్రమలు పూర్తయ్యాయి. ఈరెండు పాటల చిత్రీకరణ జులై రెండవ వారంలో చేస్తారు. అగష్టు రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు.
>హీరో నాని ఈచిత్రం గురించి మాట్లాడుతూ: " నా కేరీర్ స్టార్టింగ్ నుండి చాలా వైవిధ్యమైన పాత్రల్లో నటించాను. కాని దర్శకుడు మారుతి తీర్చిదిద్దిన నా పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. నా చిత్రాలంటే ఫ్యామిలి అంతా కలసి వచ్చి చూసేలా వుంటాయి, ఈచిత్రం ఫ్యామిలితో పాటు యూత్ అంతా వచ్చి ఎంటర్‌టైన్ అయ్యేలా వుంటుంది. నాకు దర్శకుడు మారుతి చెప్పిన కథ నచ్చటంతో వెంటనే అంగీకరించమే కాకుండా ఎకధాటిగా చిత్రాన్ని కంప్లీట్ చేశాను. ఈ చిత్రం లో నేను ఎప్పుడు చెయ్యని వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలోనే కామెడి వుండటంతో నా కేరక్టరే ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేస్తుంది. అలాగే హీరోయిన్ లావణ్య తన పాత్రలో చాలా ఒదిగి నటించింది. మురళి శర్మ గారు సర్‌ప్రైజింగ్ పాత్రలో అందిరిని ఆకట్టుకుంటారు. అలాగే నటించిన ఆల్ కమెడియన్స్ నవ్వంచడమే పనిగా పెట్టుకుని నవ్విస్తారు. అందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా నిర్మాత బన్ని వాసు తనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా హ్యపిగా ఎంజాయ్‌బుల్ గా షూటింగ్ ని చేసే అవకాశాన్ని కల్పించారు. అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ వలన షూటింగ్ ఫీలింగ్ లేదు. థ్యాంక్స్ టు ఆల్ మై మూవీ టీం " అని అన్నారు
>లావణ్య త్రిపాఠి తన పాత్ర గురించి చెబుతూ: " అందాలరాక్షసి చిత్రం తో పరిచయమయ్యిన నేను మెదటి చిత్రంతోనే అందరి అభిమానాన్ని సంపాయించుకున్నాను. తరువాత చాలా కథలు విన్నాను. విన్న ప్రతి చిత్రం చేయటం లేదు. ఎన్ని చిత్రాలు చేశామనేది కాదు ఎన్ని చిత్రాలు ప్రేక్షకులకి గుర్తున్నాయి అనేది మెయిన్ పాయింట్ , అందుకే ఆచు తూచి చేస్తున్నాను. దాదాపు నేను చేసిన ప్రతి చిత్రం కూడా నాకు పేరు తీసుకొచ్చిన చిత్రమే. ఇప్పుడు ఈ భలే భలే మగాడివోయ్ చిత్రంలో చక్కటి తెలిగింటి అమ్మాయిగా కనిపిస్తుంది. మన పక్కింటి అందమైన అమ్మాయి లా అందరి మనసులు దొచుకునేలా దర్శకుడు మారుతి పాత్రని క్రియోట్ చేశారు. ముఖ్యంగా నాని , నాకు మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మనసుని గిలిగింతలు పెట్టేలా వుంటాయి. మారుతి గారు చెప్పిన కేరక్టర్ చాలా బాగా నచ్చి చేస్తున్నాను. ఆయన డైరక్షన్ లో చిత్రం చేస్తున్నా ఫీలింగే లేదు నాకు. ఓ ఫ్రెండ్స్ తో వున్న ఫీలింగ్‌నే వుంది. నిర్మాత బన్ని వాసు గారు చాలా కోపరేటివ్ పర్సన్, ఆర్టిస్ట్ కి ఎప్పుడూ చిన్న ఇబ్బంది కూడా పెట్టకూడదు అనుకునే అతి తక్కువమంది నిర్మతల్లో ఆయన ఒకరు" అని అన్నారు.
>హ్యట్రిక్ సక్సస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి మాట్లాడుతూ: " ప్రేమకథాచిత్రం తో సరికొత్త జోనర్ తో సినిమా చేశాను. అలాగే కొత్తజంట లో ఇద్దరు సెల్ఫిష్ లు లవ్ చేసుకుంటే ఆ జంట ఎలావుంటుందో చెప్పాను. ఇప్పడు నాని, లావణ్య లు జంట గా భలే భలే మగాడువోయ్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ చిత్రం టోటల్ గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాము. ఇది కూడా కొత్తరకం జోనర్ లో తెరకెక్కిస్తున్నాము. హీరో నాని , హీరోయిన్ లావణ్య ల పాత్రలతో పాటు చిత్రంలో నటించే ప్రతి ఒక్కరి పాత్ర కూడా అందంగా, వైవిధ్యంగా చేశాము. చిత్రం చూసినంతసేపు నవ్వించే ప్రయత్నంగానే ఈ చిత్రం చేశాము. క్లైమాక్స్ షూటింగ్ లో హీరో నాని గారు కొంచెం ప్రమాదానికి గురయ్యారు. అయినా కూడా ఎక్కువ టైం తీసుకోకుండా మల్లి షూటింగ్ లో పాల్గోన్నారు. నాని గారి డెడికేషన్ కి హ్యట్సాఫ్. లావణ్య కూడా చాలా బాగా నటించింది. రెండు పాటలు మినహ షూటింగ్ మెత్తం పూర్తయ్యింది. ఈనెల రెండవ వారంలో ఈ సాంగ్స్ చిత్రీకరణ చేసి అగష్టు రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. " అని అన్నారు
>ఈ సందర్భంగా నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ "మారుతి చెప్పిన కథ చాలా ఎంటర్‌టైనింగ్ గా వుంది. ఈ చిత్రాన్ని ఎస్ ప్రోడ్యుసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) & UV Creations Prod No 1గా ఏక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాము. నాని, లావణ్య త్రిపాఠి లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈచిత్రం క్లైమాక్స్ షూటింగ్ లో హీరో నాని గారు కొంచెం ప్రమాదానికి గురయ్యారు. అయినా కూడా ఎక్కువ టైం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గోన్నారు. అంతలా నాని గారు మా చిత్రం కోసం పనిచేస్తున్నారు.. మురళి శర్మ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, భద్రం పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. జులై రెండవ వారంలో రెండు సాంగ్స్ చిత్రీకరణ తో షూటింగ్ మెత్తం ఫినిష్ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అగష్టు రెండవ వారంలో లో చిత్రాన్ని విడుదల చేస్తాము.ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు" .అని అన్నారు.
>నటీనటులు..
>నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ మరియు తదితరులు..
>ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, ఎడిటర్:ఉద్దవ్,ఆర్ట్:రమణ వంక, ఫొటొగ్రఫి:నిజార్ షఫి, సంగీతం: గోపి సుందర్, నిర్మాత:బన్నివాసు, రచన, దర్శకత్వం:మారుతి