ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దగ్గరవుతున్నా... బోలెడంతమంది కొత్తమ్మాయిలు తెరపైకొస్తున్నా... కాజల్ జోరు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. ఆమెకి వద్దంటే అవకాశాలు వస్తున్నాయి. సరైన కథలు దొరకడం లేదంటూ తమిళంలోకి వెళ్లిన కాజల్ మళ్లీ తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మహేష్ బ్రహ్మోత్సవంలో నటించేందుకు ఒప్పుకొన్న ఆమె తాజాగా ఎన్టీఆర్ చిత్రానికి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ చిత్రం కోసం కాజల్‌ని ఎంపిక చేశారట. ముందస్తుగానే ఆమె దగ్గర కాల్షీట్లు తీసేసుకొన్నారట. మొన్నటిదాకా తెలుగులో అస్సలు అవకాశాలు లేనట్టుగా కనిపించిన కాజల్ ఉన్నట్టుండి దూకుడు పెంచడంతో సాటి కథానాయికలు భయపడిపోతున్నారట. కాజల్‌ని ఏ రకంగానూ లైట్‌గా తీసుకోకూడదని భావిస్తున్నారట. ఈ రెండే కాకుండా... మంచి కథలొస్తే తెలుగు చిత్రాలే చేస్తానని చెబుతోందట కాజల్. అన్నట్టు ఆమె భారీగానే ఛార్జ్ చేస్తోందట. మిగతా కథానాయికలతో పోల్చి చూసుకొంటే ఆమె రేటు కాస్త ఎక్కువేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అయినప్పటికీ ఆమెని పిలిచి పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు మనవాళ్లు. అందం విషయంలో ఏమాత్రం తగ్గకపోవడం, ఎలాంటి పాత్రయినా చేయడానికి సిద్ధపడటం ఆమెకి ప్లస్ పాయింట్స్‌గా మారాయి.