పూరితో నటించే ఛాన్స్ పోగొట్టుకొన్నాడే అని నితిన్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గ మరో అవకాశం ఆయన చేతికి అందినట్టు సమాచారం. ఏకంగా త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశాన్ని నితిన్ సొంతం చేసుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. `సన్నాఫ్ సత్యమూర్తి` తర్వాత త్రివిక్రమ్ మరో సినిమా పట్టాలెక్కించలేదు. మహేష్, పవన్‌కళ్యాణ్‌లాంటి స్టార్లతో సినిమాలు చేయాలనుకొన్నాడు కానీ... వాళ్లంతా డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. మహేష్‌తో సినిమా చేయాలంటే ఫిబ్రవరి వరకు ఆగాలి. పవన్‌తో సినిమా అన్నా అంతే. అందుకే ఈ గ్యాప్‌లో ఓ యంగ్ హీరోతో సినిమా లాగించేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట. అందుకోసం నితిన్, నాగచైతన్యలాంటి ఇద్దరు ముగ్గురు కథానాయకుల్ని పరిశీలించాడట. చివరికి నితిన్ అయితేనే బాగుంటుందని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం సాగుతోంది.త్వరలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ఇదే వార్త గనక నిజమైతే నితిన్ జాక్‌పాట్ కొట్టినట్టే. మామూలుగా అయితే ఆయన పూరితో `లోఫర్` అనే సినిమా చేయాలనుకొన్నాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే.