Advertisementt

రమ్యకృష్ణతో అనుష్క ముచ్చట్లు..!

Fri 03rd Jul 2015 08:13 AM
anushka,ramyakrishna,bahubali,prabhas,rana,anushka,bahubali movie,bahubali news,bahubali on 10 july  రమ్యకృష్ణతో అనుష్క ముచ్చట్లు..!
రమ్యకృష్ణతో అనుష్క ముచ్చట్లు..!
Advertisement
Ads by CJ

రమ్యకృష్ణ: ఏం అనుష్కా...గతంలో ఓసారి రాజమౌళితో పని చేసినట్టున్నావ్‌.. అప్పుడు కూడా ఇంతేనా సినిమాను చెక్కుతూనే ఉన్నాడా? అంటే నాతో కూడా ఓ సినిమాలో స్టెప్పులు వేయించాడనుకో!

అనుష్క: ఏమో మేడమ్‌ అప్పుడు నేను పరిశ్రమకి వచ్చిన కొత్త కావడంతో అంతగా పట్టించుకోలేదు. మీరు సీనియర్లు మీకే తెలిసుండాలి. నేనైతే కళ్ళల్లో ఫీలింగ్స్‌ను తెలియకుండా సన్‌గ్లాస్‌ పెట్టుకుని మేనేజ్‌ చేసుకుంటున్నా. కావాలంటే చూడండి ఎన్ని సన్‌గ్లాస్‌లు తెచ్చుకున్నానో!. అది సరే కానీ మేడమ్‌ మీరు అమ్మవారి పాత్రలకు ప్రసిద్ధి అని విన్నాను. మరి ‘శివగామి’ పాత్ర ఎలా కుదిరింది.

రమ్య: ఏమో.. నువ్వు కత్తి తిప్పడంలో ఫేమస్‌. అదేలాగో ఇది కూడా అలాగే.

అనుష్క: మన గురించి వదిలేయండి మేడమ్‌. రాజమౌళి, ఆయన గురువు దేనికి ఫేమస్‌ అంటారు? 

రమ్యకృష్ణ: ఇంక దేనికి.. ఈగని కూడా హీరోగా చూపించడంలో, ఇదిగో ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తియ్యడంలో ప్రసిద్ధి. ఈయన గురువు హీరోయిన్‌ అందాలను చూపించడంలో ప్రసిద్ధి. 

 

అనుష్క: నాకు తెలిసి ఆయన చూపిస్తాడు. ఈయన చెక్కుతాడు. అంతే కదా మేడమ్‌. 

పై ఫోటో చూస్తుంటే రమ్యకృష్ణ, అనుష్క ఈ విధంగా మాట్లాడుకుంటున్నట్లు లేదా. బాహుబలి సినిమా షూటింగ్‌ సమయంలో కాస్త గ్యాప్‌ దొరికిన సమయంలో రమ్యకృష్ణ, అనుష్క ఇలా ముచ్చట్లేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ గురువారం విడుదల చేశారు. ఇందులో అనుష్క, రమ్యకృష్ణల ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ కుర్చీలో కూర్చొని ఉండగా... అనుష్క కింద కుర్చోని రమ్యతో ముచ్చటిస్తూ కనిపిస్తోంది. నేటి తరం అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి కింద కూర్చొని మాట్లాడడం పట్ల సీనియర్‌ ఆర్టిస్ట్‌ల పట్ల తనకున్న గౌరవాన్ని కూడా చాటింది.  ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రధారులుగా రూపొందిన బాహుబలి చిత్రం ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ