>నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘పటాస్’. కొత్త దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ఈ చిత్రం కన్నడ రీమేక్‌లో గోల్డెన్‌స్టార్ గణేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘పటాకి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లో తెలిపి ఆ స్టిల్స్‌ను పోస్ట్ చేశాడు. గతంలో గణేష్‌తో ‘ఇట్లు శ్రావణి...సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని రీమేక్ చేసి విజయం సాదించిన మంజు స్వరాజ్ ‘పటాకి’కి దర్శకుడు. కన్నడ ‘పటాస్’లో కీలకపాత్రకు మనోజ్ వాజ్‌పేయ్‌ని ఎంచుకున్నారు.