Advertisementt

'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రిలీజ్ కు రెడీ..!

Wed 01st Jul 2015 09:25 PM
superstar kidnap,nandu,sushanth reddy,chandu penmathsa  'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రిలీజ్ కు రెడీ..!
'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రిలీజ్ కు రెడీ..!
Advertisement
Ads by CJ

నందు, భూపాల్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో లక్కీ క్రియేషన్స్ బ్యానర్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో చందు పెన్మత్స నిర్మించిన చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ "ముగ్గురు యువకులు హీరో మహేష్ బాబు ను కిడ్నాప్ చేసే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో రెండు పాటలుంటాయి. జూలై 3న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

నిర్మాత చందు పెన్మత్స మాట్లాడుతూ "మా బ్యానర్ లో వస్తున్న మొదటి చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే సినిమా ఇది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

భూపాల్ మాట్లాడుతూ "అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రమిది. మహేష్ ఫాన్స్ ఎవరు సినిమా చూసి డిసప్పాయింట్ అవ్వరు. అందరికి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేసిన నాని, నరేష్, తనీష్, మనోజ్ లకు నా థాంక్స్" అని చెప్పారు.

ఆదర్శ్ బాలకృష్ణ మాట్లాడుతూ "సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

శ్రద్ధా దాస్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నాదొక లేడీ గబ్బర్ సింగ్ రోల్. ఇదొక క్రైమ్ కామెడీ చిత్రం. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తిక్, ఎడిటర్: బసవ పైదిరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఈశ్వర్, డైరెక్టర్: సుశాంత్ రెడ్డి, నిర్మాత: చందు పెన్మత్స.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ