Advertisementt

'యూత్ ఫుల్ లవ్' మూవీ విడుదలకు సిద్ధం..!

Wed 01st Jul 2015 08:53 PM
youthfull love,vemuganti,manoj nandam,radharam rajalingam  'యూత్ ఫుల్ లవ్' మూవీ విడుదలకు సిద్ధం..!
'యూత్ ఫుల్ లవ్' మూవీ విడుదలకు సిద్ధం..!
Advertisement
Ads by CJ

మనోజ్ నందం, ప్రియదర్శిని జంటగా నవీన్ క్రియేషన్స్ బ్యానర్ పై వేముగంటి దర్శకత్వంలో రాధారం రాజలింగం నిర్మిస్తున్న సినిమా 'యూత్ ఫుల్ లవ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ "సినిమా అంతా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూంటుంది. నిర్మాతకు ఇది మొదటి చిత్రమయినా ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా నిర్మించారు. సినిమాలో నాలుగు పాటలుంటాయి. టైటిల్ బావుందని అందరు చెప్తున్నారు. జూలై 3న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

నిర్మాత రాధారం రాజలింగం మాట్లాడుతూ "ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ చిత్రాన్ని రిలీజ్ వరకు తీసుకొచ్చాం. సినిమాలో నాలుగు పాటలు అధ్బుతంగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సునీల్ కశ్యప్ అందించారు. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

హీరో మనోజ్ నందం మాట్లాడుతూ "మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ ప్రేమకథ ఈ చిత్రం. నేను ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయ్యాను. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ సందేశాత్మక చిత్రమిది. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీకాంత్ దేవా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, దొరై, రాధాకృష్ణ, శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, పాటలు: శ్రేష్ట, మాటలు: రాజేష్ సాయి, కెమెరా: శ్రావణ్ కుమార్, నిర్మాత: రాధారం రాజలింగం, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వేముగంటి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ