Advertisementt

సాయి వెంకట్ నూతన బ్యానర్ లోగో లాంచ్..!

Wed 01st Jul 2015 12:01 PM
sai venkat,krishnayya,ramasathya narayana,kadambari kiran  సాయి వెంకట్ నూతన బ్యానర్ లోగో లాంచ్..!
సాయి వెంకట్ నూతన బ్యానర్ లోగో లాంచ్..!
Advertisement
Ads by CJ

లయన్ సాయివెంకట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. అటు రియాల్టీ రంగంలోనూ ఇటు సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసారు. కొన్ని చిత్రాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించి దర్శకనిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న సాయి వెంకట్ ఒకేసారి పదిసినిమాలను ప్రారంభించి సరికొత్త చరిత్రను తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

సాయి వెంకట్ మాట్లాడుతూ "కొత్త తరాన్ని ప్రోత్సహించాలన్న సమున్నత లక్ష్యంతో గ్లోబల్ మీడియా అనే బ్యానర్ ను స్థాపించాను. ఈ బ్యానర్ పై ఒకే సారి పది సినిమాలను ప్రారంభించి సరి కొత్త రికార్డును సృష్టించాలనుకుంటున్నాను. ప్రతిభావంతులైన కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే.. శంకరాభరణం.. స్వాతిముత్యం లాంటి కళాత్మక చిత్రాలు మరిన్ని వచ్చి సినీవినీలాకాశంలో తెలుగువారికి మరింత ప్రత్యేక స్థానం ఉంటుంది. కొత్త దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ వస్తే తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.  గ్లోబల్ మీడియా పతాకంపై నిర్మించే చిత్రాల్లో వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నాం. ఓ కమిటీ ను ఏర్పాటు చేసి స్క్రిప్ట్ లను విననున్నాం. పది సినిమాలను పది డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కించనున్నాం. జూలై చివరి వారంలో లేదా ఆగస్ట్ నెలలో షూటింగ్ ప్రారంభించనున్నాం. పది చిత్రాల ఆడియో విడుదల కూడా ఒకేసారి చేయనున్నాం" అని చెప్పారు.

ఎమ్మెల్యే  క్రిష్నయ్య మాట్లాడుతూ "సినిమాల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుంది. సమాజాన్ని దారికి తీసుకువచ్చే బాధ్యత సినీ పరిశ్రమకు ఉంది. ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి చిత్రాలను సాయి వెంకట్ నిర్మిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్ల, పద్మిని, కాదంబరి కిరణ్, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ