Advertisementt

'దేవుడితో పోరాటం' ఆడియో లాంచ్..!

Wed 01st Jul 2015 11:41 AM
devuditho poratam,brunda,abothula sreenivas,sivashakthidattha  'దేవుడితో పోరాటం' ఆడియో లాంచ్..!
'దేవుడితో పోరాటం' ఆడియో లాంచ్..!
Advertisement
Ads by CJ

బృంద గోపాల క్రియేషన్స్‌ బ్యానర్‌పై బృంద ప్రధానపాత్రలో ఆబోతుల శ్రీనివాస్‌ దర్శకత్వంలో అబోతుల అనూరాధ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవుడితో పోరాటం’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివశక్తిదత్తా ఆడియో సిడీలను విడుదల చేసారు. అత్రేయ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా...

శివశక్తి దత్తా మాట్లాడుతూ ‘‘శ్రీనివాస్‌గారికి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన చేసిన నాలుగో చిత్రమిది. తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. 

బి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శకుడు శ్రీనివాస్‌ కు సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా సినిమా చేయడం ఆపలేదు. ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొందింది. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా ప్యాషన్‌తోనే వస్తారు. అలా ప్యాషన్‌తో వచ్చిన శ్రీనివాస్‌గారు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయి యూనిట్‌కి మంచి పేరుని తీసుకురావాలి’’ అన్నారు. 

శివాజీరాజా మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే మా వంతుగా వీలైనంత ప్రోత్సహిస్తుంటాం. చిన్న సినిమాగా విడుదలకానున్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అత్రేయ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సెంటిమెంట్‌ ప్రధానంగా ఉంటుంది. శ్రీనివాస్‌గారు మంచి కథతో సినిమాని రూపొందించడమే కాకుండా మంచి సంగీతాన్ని చేయించుకున్నారు. తప్పకుండా సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది’’ అన్నారు. 

నిర్మాత అబోతుల అనూరాధ మాట్లాడుతూ ‘‘ మా బ్యానర్‌లో చేసిన నాలుగో చిత్రమిది. నటీనటులు, టెక్నిషియన్స్‌ సహకారంతో అనుకున్న సమయంలో సినిమాని విజయవంతంగా పూర్తి చేశాం. సినిమా బాగా వచ్చింది.’’ అన్నారు. 

దర్శకుడు అబోతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘అన్నా, చెల్లెల మధ్య సెంటిమెంట్‌తో కథ ఉంటుంది. అసూయతో చెల్లెలు ప్రాణాలు పోవాలని కోరుకునే ఓ అన్న అదే చెల్లికి ప్రాణం మీదకి వస్తే ఏం చేసాడనేదే  ఈ చిత్ర కథ. అత్రేయగారు మంచి సంగీతాన్ని అందించారు. సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికేట్‌ను పొందింది. త్వరలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. సపోర్ట్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్‌’’ అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ