Advertisementt

'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విజయోత్సవ వేడుక..!

Tue 30th Jun 2015 05:29 AM
krishnamma kalipindi iddarinee,lagadapati sreedhar,sudheer babu  'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విజయోత్సవ వేడుక..!
'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విజయోత్సవ వేడుక..!
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. జూన్ 19న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "నిజాయితీతో కూడిన ప్రేమ కథే ఈ చిత్రం. సినిమా చూసిన వారంతా ఇలాంటి ఓ మంచి ప్రేమ కథను చూసి ఇరవై సంవత్సరాలయిందని చెప్పారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేసారు. సుధీర్ బాబు తన నటనతో ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళారు. సుధీర్ బాబు, నందితల జంట సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం స్పూర్తితో ఇలాంటి మరిన్ని చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ హరి మాట్లాడుతూ "సినిమాకు డబ్బు పెట్టిన వారు మాత్రమే నిర్మాతలు కారు. సక్సెస్ చేసిన ప్రేక్షకులు కూడా నిర్మాతలే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు" అని చెప్పారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ "ఓ ఆర్టిస్ట్ జీవితంలో ఎన్ని హిట్స్ వచ్చినా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం మాత్రం ఒకటే ఉంటుంది. నా వరకు అది 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం. నా పెర్ఫార్మన్స్ బావుందని అందరు చెబుతున్నారు. మహేష్ బాబు అధ్బుతంగా నటించావని చెప్పారు. నా బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ