Advertisementt

ఏఎన్నార్‌కి అంకిత‌మిచ్చిన బ‌న్నీ..!

Sun 28th Jun 2015 02:24 AM
allu arjun dedication,manam,anr,nagarjuna,racegurram,film fare award,allu arjun film fare award  ఏఎన్నార్‌కి అంకిత‌మిచ్చిన బ‌న్నీ..!
ఏఎన్నార్‌కి అంకిత‌మిచ్చిన బ‌న్నీ..!
Advertisement
Ads by CJ
ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్త‌మ న‌టుడు అవార్డు  కోసం భారీగా పోటీ క‌నిపించింది. నాగార్జున‌, వెంక‌టేష్‌, మ‌హేష్‌లాంటి సీనియ‌ర్లు పోటీలో నిలిచారు. అయితే ఆ అవార్డు చివ‌రికి అల్లు అర్జున్ సొంతమైంది. `రేసుగుర్రం`లో న‌ట‌న‌కుగానూ ఆయ‌న ఈ అవార్డుని తీసుకొన్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందానికి కృత‌జ్జ‌త‌లు చెబుతూ  అవార్డును ఏఎన్నార్‌కి అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు అల్లు అర్జున్‌. లెజెండ్రీ యాక్ట‌ర్ ఏఎన్నార్‌కి నివాళిగా నాకు ద‌క్కిన ఫిల్మ్‌ఫేర్‌ని అంకితం చేస్తున్నా అని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్‌. ఏఎన్నార్ న‌టించిన చివ‌రి చిత్రం `మ‌నం`కి 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ద‌క్కాయి. దీంతో అంద‌రూ మ‌రోసారి ఏఎన్నార్‌ని త‌ల‌చుకొంటూ నివాళుల‌ర్పిస్తున్నారు. ఇప్పుడు బ‌న్నీ కూడా త‌న పురస్కారాన్ని ఆయ‌న‌కే అంకితం ఇవ్వ‌డం విశేషం. `మ‌నం`, `రేసుగుర్రం` చిత్ర‌బృందాలు అవార్డు రావ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ట్విట్ట‌ర్‌లో ఆ రెండు చిత్రాల గురించి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ