Advertisementt

మోహన్ బాబు, అల్లరి నరేష్ కలయికలో చిత్రం..!

Sat 27th Jun 2015 07:03 AM
mohanbabu,allari naresh,manchu vishnu,sreenivasa reddy  మోహన్ బాబు, అల్లరి నరేష్ కలయికలో చిత్రం..!
మోహన్ బాబు, అల్లరి నరేష్ కలయికలో చిత్రం..!
Advertisement
Ads by CJ

తన విలక్షణ నటనతో ప్రతి నాయకుడు నుండి కథానాయకుడు వరకు ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి, ఆరువందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు హీరోగా సినిమా ప్రారంభం కానుంది. ఈ తరంలో తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన కామెడి స్టార్ అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్ ల కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీచిత్రాన్ని డిఫరెంట్ మూవీస్ ను నిర్మిస్తూ నిర్మాతగా, హీరోగా అందరినీ మెప్పిస్తున్న మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ