Advertisementt

ప్రిన్స్ కొత్త చిత్రం ప్రారంభం..!

Sat 27th Jun 2015 05:49 AM
pelliki mundu prema katha,prince,sunayana,madhu gopu  ప్రిన్స్ కొత్త చిత్రం ప్రారంభం..!
ప్రిన్స్ కొత్త చిత్రం ప్రారంభం..!
Advertisement
Ads by CJ

ప్రిన్స్, సునయన, అశ్విని ప్రధాన పాత్రల్లో 9 స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మధు గోపు దర్శకత్వంలో సుధాకర్ పట్నం, నాగేశ్వరావు సిహెచ్.వి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పెళ్ళికి ముందు ప్రేమ కథ'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక శనివారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నరేష్ క్లాప్ కొట్టగా, అనంతరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

నిర్మాత సుధాకర్ పట్నం మాట్లాడుతూ "ఇదొక సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిపిన ప్రేమకథ. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రమిది" అని చెప్పారు.

దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ "ఈ చిత్ర కథ చెప్పిన వెంటనే నచ్చి సినిమాను నిర్మించడానికి అంగీకరించిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళికి ముందు ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమకథ మాత్రం చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టొరీ" అని చెప్పారు.

హీరో ప్రిన్స్ మాట్లాడుతూ "పెళ్ళికి ముందుండే ప్రేమ కథను సక్సెస్ చేసుకుంటే సంతోషంగా ఉంటారు. లేదంటే వేరే మార్గాలు ఆలోచిస్తారు. ఈ సినిమా కథ అవే అంశాలతో సాగుతుంది. నా జోనర్ లో ఉండే ఓ లవ్ స్టొరీ ఇది. మ్యూజిక్ ఆల్రెడీ రెడీగా ఉంది. జూలై నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం" అని చెప్పారు.

హీరోయిన్ సునయన మాట్లాడుతూ "తమిళంలో వరుసగా సినిమాలు చేయడంతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. చాలా సంవత్సరాల తరువాత తెలుగు చిత్రంలో నటిస్తున్నాను. సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉంటాయి. సినిమా ప్రారంభమయినప్పటి నుండి ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: రవికుమార్, మ్యూజిక్: యాజమాన్య, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: సుధాకర్ పట్నం, నాగేశ్వరావు, కథ-దర్శకత్వం: మధు గోపు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ