>ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’. ‘నువ్వునేను’ఫేమ్ అనిత ఓ ప్రత్యేకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో డిరపుల్, గరిమ, మదాలసశర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఎయల్లార్కే దర్వకుడు. ఈ చివరి చిత్రం రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్‌కిరణ్ మొదటి జయంతి సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా వీలుకాలేదు. తాజాగా జూన్26న ఆయన 2వ జయంతి సందర్బంగా ఆయన చివరి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం ఈసారి కూడా విడుదలకాకపోవడం ఉదయ్ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.